Breaking News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమాచార శాఖా మంత్రి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి కుటుంబ సమేతంగా చేరుకున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కి ఆలయ ఏఈఓ ప్రభాకర్ రెడ్డి అర్చకులు స్వాగతం పలికారు. మంత్రి ముందుగా తులాభారం మొక్కులు తీర్చుకున్నారు. ధ్వజస్తంభమునకు మొక్కిన అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా ఏ ఈ ఓ తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. అమ్మవారి దర్శనానికి ముందు మంత్రి కి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర స్వాగతం పలికిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య మరియు జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార ఇంఛార్జి అధికారి భాస్కర్ రెడ్డి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *