రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు హిందుస్థాన్ యునీలివర్ , సీఎస్ఆర్ యాజమాన్యం గ్రామాలను దత్తత తీసుకోవడం అభిందనీయులని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం రెవెన్యూ కాలనీలో హిందుస్థాన్ యునీలివర్ ( హార్లిక్స్ ప్యాక్టరీ) యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చేపట్టిన ప్రభాత్ వ్యర్థ పదార్థాల నిర్వహణ, పోషన్ సాతి కార్యక్రమాలను కలెక్టరు మాధవీలత ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టరు కె .మాధవీలత మాట్లాడుతూ ధవళేశ్వరం, రాజవోలు గ్రామాలను దత్తత తీసుకోని వ్యర్థపదార్థాల నిర్వహణ కార్యక్రమాలను చేపట్టి అమలు చేయడానికి ముందుకు రావడం ప్రోత్సహించ తగ్గ విషయమన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వహణ ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా మన్నారు. కాలుష్య నివారణ కొరకు ఆ దిశలో పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగం చేపట్టి అమలు చేస్తుందన్నారు. ప్రజలు, పరిశ్రమల భాగస్వామ్యం ఉంటే మరింత పటిష్టంగా అమలు చేయడం సాద్యమవు తుందన్నారు. ఈ రోజు హిందుస్థాన్ యునీలివర్ యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యత గా ధవళేశ్వరం, రాజవోలు గ్రామాలను దత్తత తీసుకొని కాలుష్యరహిత గ్రామాలుగా తీర్చి దిద్దే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్ళి చెత్త సేకరణ చేసేందుకు నూతన వాహనాలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రక్తహీనత గల గర్భణీలు, బాలింతలు, చిన్నారులను గుర్తించి వారికి అంగన్ వాడీ కేంద్రాలు ద్వారా పెద్ద ఎత్తు వైఎస్ఆర్ సంపూర్ణ పోషక ఆహార పథార్థాలను అందజేస్తున్నా మన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని పోషక లోపంతో ఉన్న పిల్లలకు ఇప్పటికే అంగన్ వాడీ కేంద్రాలు ద్వారా అందిస్తున్న సంపూర్ణ పోషకాహరంతో పాటు ప్రజల సహాకారంతో మరో అడుగు ముందుకు వెస్తున్నా మన్నారు. ఆ కేటగిరీ లోని వారికి మరింత పౌష్టికాహారం అందించే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ప్రభాత్ ఫోషన్ సాతి కార్యక్రమాలు ద్వారా మహిళలు, ముఖ్యంగా గర్భణీ, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కొరకు వారిలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్విహించడం అభినందనీయమని కలెక్టరు మాధవీలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
హిందుస్థాన్ యునీలివర్ కంపెనీ భాగస్వామ్యంతో ప్రజారోగ్య పరిరక్షణకు తమ వంతు సహకారంగా కొవ్వూరు, కడియం, రాజమండ్రి రూరల్, సీతానగరం మండల్లోని 53 గ్రామాల్లో గల 107 సచివాలయాల పరిధిలోగల 2.5 లక్షల ప్రజలకు ఆరోగ్యం , ఆహార సమతుల్యత కార్యక్రమాలపై అవగాహన నిర్వహించడం జరుగుతుందని ప్రభాత్ సిఎస్ఆర్ ప్రతినిధి మంధీరానగ్రాత్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రభాత్ సిఎస్ఆర్ ప్రతినిధి మంధీరానగ్రాత్ , డిఎల్పీవో సత్య నారాయణ, మ్యాన్యుఫాక్చరింగ్ మేనేజర్ శేషుకుమార్, ప్యాక్టరీ హెచ్ ఆర్ మేనేజరు ఎస్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News