పెన్షన్ పొందు ట్రెజరి నందు మాత్రమే E-KYC చేయించుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గొదావరి జిల్లా పరిధిలోగల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ప్రభుత్వ పెన్షనదారులు అందరు తమ యొక్క పెన్షన్ పొందు ట్రెజరి నందు మాత్రమే E-KYC చేయించుకోవాలని జిల్లా ఖజానా మరియు లెక్కల అధికారి ఎన్.సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గొదావరి జిల్లా పరిధిలో ఇంకా 2,400 మంది పెన్షనర్లు E-KYC సమర్పించియుండలేదని తెలియ చేశారు. కావున వారు ఈ నెల 12 వ తారీకు గడువు లోపల తమ యొక్క పెన్షన్ సమాచారం సంబంధిత ట్రెజరి సిబ్బంది కి అందజేసి ఈ – కేవైసి పూర్తి చేయవల్సిందిగా తెల్పియున్నారు . ఇందుకొరకు పెన్షనదారులు తమ పెన్షన్ పొందు ట్రెజరి కార్యాలయo నందు పెన్షన్ పుస్తకం , ఆదార్ మరియు ట్రెజరీ రికార్డ్ లలో నమోదు చేసిన చరవాణి ( OTP కొరకు ) తో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *