జాబ్ మేళా కు 612 మంది హాజరు

-302 మంది వివిధ కంపెనీల్లో ఎంపిక
-ఎంపికైన అభ్యర్థులను అభినందించిన జేసీ తేజ్ భరత్
-నైపుణ్యం సాధించడం ద్వారా ఉద్యోగాలు సాధించగలరు
-జేసీ తేజ్ భరత్

తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
యువత వారిలోని నైపుణ్యం పెంచుకోవడం ద్వారా మరిన్ని మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందగలుగతారని, ఆదిశలో లక్ష్యాలను సాధించడానికి, ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యాభివృద్ధి కి చొరవ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పిలుపు నిచ్చారు.

బుధవారం ఉదయం కొవ్వూరు నియోజకవర్గం, తాళ్లపూడి మండలం లోని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యం లో శ్రీ కరిబండి సుబ్బారావు స్మారక డిగ్రీ కళాశాలలో వికాస వారి ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళాకు జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, యువత కు ఉద్యోగ అవకాశాలు కల్పన దిశగా ఇకపై జిల్లా లో రెండు జాబ్ మేళాలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అందులో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదైనా ఒక మండల పరిధిలో జాబ్ మేళా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. తద్వారా ఎక్కువ మందికి అవకాశం కల్పించడం సాధ్యం అవుతుందన్నారు. జాబ్ మేళా నిర్వాహకులను, కళాశాల యాజమాన్యాన్ని, వికాస వారిని జేసీ అభినందించారు. ఇటువంటి జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకుని, స్థిరమైన ఉద్యోగం పొందాలని, ఇందుకు సరైన సమాధానాలు ఇవ్వటం ద్వారా మాత్రమే సాధ్యం అన్నారు. తద్వారా మీమీ కుటుంబాలకు ఆసరాగా నిలవడం ఐ ఐ టి వంటి సంస్థల లో చదువుకున్న వారిలో 85 శాతం మంది నేరుగా క్యాంపస్ ఇంటర్వ్యూ ఎంపిక అవ్వడం జరుగుతుందని అన్నారు. యువత సరైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి 22 నుంచి 32 ఏళ్ల మధ్యలో మాత్రమే సారిన సమయం అన్నారు. ఆలోగా ఒక స్థిరమైన ఆదాయం వచ్చే రంగంలో యువత నిలదొక్కుకుని, కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. కమ్యూనిటీ స్కిల్స్, ఆర్టిఫీషియల్ స్కిల్స్ పెంచుకోవాలని, అటువంటి వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని తేజ్ భరత్ అన్నారు. అందరూ ప్రభుత్వా ఉద్యోగాలు కోసం మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు హాజరై విజయం సాధించాలన్నారు.

మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జోడాల వెంకట్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాల నిరుద్యోగులు యువతను దృష్టిలో పెట్టుకొని ఈ జాబ్ మేళాను నిర్వహించా మన్నారు . ఈరోజు ఉద్యోగ మేళాలో 21 కంపెనీలు, 900 లకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పన ఉద్దేశ్యం తో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వికాస మేనేజర్‌ సత్యనారాయణ  మానవత అధ్యక్షుడు  జోడాల వెంకటేశ్వర రావు, కరిబం డి డిగ్రీ కళాశాల డైరెక్టర్ త్రినాధ స్వామి, మాజీ అధ్యక్షులు గుప్త, సభ్యులు చిన సుబ్బారావు, రమేష్ వివిధ కంపెనీ ల ప్రతినిధులు, నిరుద్యోగ యువతి యువకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *