తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కు చెబుదాo స్పందన అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కన్ఫెరెన్స్ హాల్ నుండి జిల్లాలోని ఆర్.డి.ఓ. లు, తహశీల్దార్లు, సర్వేయర్లు, వి ఆర్ ఓ లతో రీసర్వే, విలేజ్ సర్వేర్ ల డేటా ఎంట్రీ, జగనన్న కు చెబుదాం, మ్యూటేషన్, అసైన్ మెంట్ ల్యాండ్స్ తదితర అంశాలపై వీడియో కన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్నకు చెబుదాం స్పందన పై ప్రాధాన్యత ఇస్తున్న అంశం కాబట్టి అర్జీలను సంతృప్తి స్థాయిలోన్ పరిష్కారం చూపాలని తెలిపారు. అందుకు తగిన విధంగా ఎండార్స్మెంట్ చేయాలని తెలిపారు. రీఓపెన్ ఎక్కువగా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మ్యుటేషన్ సంబంధించిన దరఖాస్తుల పై ప్రత్యేక దృష్టి చూపాలన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలలో రైతుల భూముల విస్తీర్ణంకు సంబంధించిన విలేజ్ సర్వేల డేటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. అసైన్మెంట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్స్, కోర్టు కేసెస్ కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ కోదండరామి రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ఏ.డి. సర్వేయర్ జయరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News