విస్తృత సేవలు అందించేలా సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం సుహాసిని యం.బి.బి.ఏస్.,డి.ఏ., వివిధ ఆరోగ్య కార్యక్రమాలు పర్యవేక్షణలో భాగంగా వీరుళ్ళపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొణతాల పల్లి విలేజ్ హెల్త్ క్లీనిక్ నందు నిర్వహిస్తున్న కుటుంబ డాక్టర్ కార్యక్రమం పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమం విస్తృత సేవలు అందించేలా సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని, అదేవిధంగా గర్భిణీలకు,బాలింతలకు, కౌమార దశ పిల్లలుకు అందరికీ సేవలు అందించాలని ప్రభుత్వ లక్ష్యం లకు అనుగుణంగా ప్రగతి సాధించాలని తెలియజేసినారు.రికార్డులను పరిశీలించడం జరిగినది.అదే విధంగా ఆ గ్రామంలో నిర్వహిస్తున్న ఫ్రె డే డ్రె డే కార్యక్రమం పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమం నిర్వహణ అవశ్యకత పై సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగినది.అదే విధంగా ఈ కేంద్రంలో యం.ఏల్.హె.పి అందిస్తున్న సేవలు పరిశీలించడం జరిగింది.అదే విధంగా అందుబాటులోని మందులు, ల్యాబ్ పరీక్షలు తదితర అంశాలను సమీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ డాక్టర్ కార్యక్రమం నోడల్ అధికారి డాక్టర్ మోతీబాబు, వీరుళ్ళపాడు వైద్యాధికారి కె.నందిని,హెల్త్ క్లినిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *