-చట్టాలను సమర్థవంతంగా అమలు చేయండి..
-బాలలతో పనిచేయించే యజమానుల పై కేసులను పెట్టండి..
-స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు..
-బాల కార్మిక రహిత జిల్లాగా గుర్తింపు తీసుకురండి..
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు.
ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం సందర్భంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణంలో కార్మిక, మహిళాభివృద్ధి శిశు సంక్షేమం, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, వాసవ్య మహిళ మండలి, స్వచ్చంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలనకు 1980 సంవత్సరంలోనే అంతర్జాతీయంగాను పలు చట్టాలను చేసినప్పటికి మన దేశంలో బాల కార్మికులకు సంబంధించి నేటికి కేసులు నమోదు కావడం జరుగుతుందన్నారు. దేశంలో ఈ చట్టంపై ప్రజలను చైతన్యం చేయడం, అవగాహన కల్పించడం వంటి పరిస్థితులు రాకుండా ఉండాలని, వీలైనంత త్వరగా దేశంలో ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే స్థాయికి తీసుకురావాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చేస్తున్న చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వంతో పాటు స్వచ్చంద సంస్థలు బాధ్యతగా గుర్తించాలన్నారు. బాలకార్మికులకు వ్యతిరేకంగా ఈనెల 30వ తేది వరకు జిల్లాలో బాలకార్మికలను గుర్తించేందుకు కార్మిక, పోలీస్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమం, రెవెన్యూ, చైల్డ్‌లైన్, స్వచ్చంద సంస్థల సభ్యులతో టాస్క్‌ఫోర్స్ కమిటి ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి ఇప్పటి వరకు 23 కేసులను నమోదు చేశారన్నారు. విరిలో ఇద్దరు బాలకార్మికులను ప్రమాదకర ఆటోమొబైల్ రంగంలో పని చేయిస్తున్న యజమానులపై ప్రాస్యిక్యూషన్ క్లయిమ్ చేయడం జరిగిందన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో గుర్తించిన బాల కార్మికుల తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడం ద్వారా బాలలను పనులలో పెట్టేందుకు దారి తీసిన ఆర్థిక పరిస్థితుల నుండి విముక్తి కల్పించేందుకు దోహదపడుతుందన్నారు. బాలకార్మికులుగా గుర్తించి విముక్తి కల్పించిన వారికి పునరావాస కేంద్రాలలో చేర్పించి నిర్భంద విద్య పథకం కింద పాఠశాలలో చేర్పించాలన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి బాల్యానికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు పున:ప్రారంభమైనందున బడిఈడు పిల్లలు ప్రతీ ఒక్కరూ బడిలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మికులను, బడిబయట ఉన్న పిల్లలను, అపదలో ఉన్న బాలలను గుర్తిస్తే తక్షణమే చైల్డ్ లైన్ 1098, కు గాని పోలీస్ 100/112 లేదా ఉమెన్ హెల్ప్‌లైన్ 181కు తెలియజేయడం మనందరి బాధ్యతగా గుర్తించుకోవాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ, చట్టాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా బాల కార్మిక వ్యవస్థను సమూలంగా రూపు మాపగలుగుతామన్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో ప్రజలను చైతన్యవంతులను చేసి జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.
అనంతరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా బాల్యం… బడికి… అనే అవగాహన కల్పించే పోస్టర్‌ను, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఏర్పడి నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లోగో పోస్టర్‌ను కలెక్టర్ డిల్లీరావు విడుదల చేశారు.
తదుపరి నాదేశ బాలలాలికలపై జరుగుతున్న హింసా, దోపిడి, ఆత్యాచారాలను వ్యతిరేకిస్తానని…. బడి బయట ఉన్న బాలలందరిని బడిలోకి చేర్పిస్తానని…. అపదలో ఉన్న బాలలందరి రక్షణకు అండగా ఉంటానని…. నా ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నానని కలెక్టర్ డిల్లీరావు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. నేను బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకిని అని సిగ్నేచర్ క్యాంపెయిన్‌లో కలెక్టర్ డిల్లీరావు తొలి సంతకం చేశారు.
కార్యక్రమంలో కార్మిక శాఖ డిప్యూటి కమిషనర్ యం. శ్రీమన్నారాయణ, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జి. ఉమాదేవి, డియంహెచ్‌వో డా. యం సుహసిని, దిశ స్టేషన్ఆఫీసర్ కె. వాసవి, సిడబ్ల్యుసి చైర్పర్సన్ కె. సువార్త, సాంఫీుక సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్ ఎన్.వి. విజయభారతి, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ బిఎస్ కోశ్వరరావు, జిల్లా కో`ఆర్డినేటర్ అరవరమేష్, వాసవ్య మహిళ మండలి ప్రతినిధులు బి.కీర్తి, అసిస్టెంట్ కమిషనర్ ఎస్ఎస్పివో పి.విష్ణు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు పి శ్రీనివాస్, రత్నకుమారి ఉన్నారు.
Prajavartha Online Telugu News