విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం కంపెనీలకు పి. ఏ. సి. ఎస్ .లలో 50 శాతం వాటాలను ప్రైవేట్ వ్యక్తులకు కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయించి ఆ మేరకు 1964 చట్టాన్ని సవరణ చేసిందని, ఈ సవరణను ఇతర సవరణలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని సెప్టెంబర్ 2022న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ సవరణ వెంటనే రద్దు చేయాలని ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు ప్రధానంగా హెచ్.ఆర్ పాలసీ అమలు వరకు ఇంతవరకు జరగలేదని 2019 వేతన సవరణ రావలసి ఉన్నదని, దీనికి కావలసినటువంటి 36 జి.ఓ. ప్రకారం ఏర్పాటు చేయవలసిన డిస్ట్రిక్ట్స్ లెవెల్ సపోర్టింగ్ ఫండ్ కూడా ఇంత,వరకు ఏర్పాటు చేయలేదని, వీటితో పాటు ఇతర కోర్కెలు కూడా మాకు పరిష్కారం కాలేదని, మా డిమాండ్లు పరిష్కారం కోసం మేము ఆందోళనకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లోసోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక , అధ్యక్షుడు తోట వెంకటరామయ్య అన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా డిమాండ్లు పరిష్కారం చేయకపోతే జూన్ 19వ తేదీన డిసిసిబి ప్రధాన కార్యాలయం వద్ద జూలై 3 తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జూలై 17వ తేదీన చలో విజయవాడలో ధర్నా నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కె .సత్యనారాయణ ఏ.పీ ఫ్యాక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్. నాగేశ్వరరావు, వర్కింగ్ ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News