విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవాదాయ ధర్మాదాయ శాఖలో నిరుద్యోగులకు శఠగోపం అనే వార్తను ప్రముఖ దినపత్రిక లో ప్రచురించారని వార్తలో వాస్తవం లేదని, దేవాదాయ ధర్మాదాయ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కె రవికుమార్ ఖండించారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల తరబడి దేవాదాయ ధర్మాదాయ శాఖ నందు జూనియర్ అసిస్టెంట్స్ గా పనిచేస్తున్న వారిని చట్టప్రకారం గ్రేడ్ కార్య నిర్వాహణాధికారులుగా నియామకాలలో 20% ఇచ్చేవారిని, 20% పోస్టులు ఆ శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్కకు సరిపోవని అందువల్ల వారు చాలీచాలని జీతం లతో పనిచేస్తూ పదవి విరమణ అనంతరం ఎటువంటి ఆర్థిక ప్రయోజనములు లేకుండా విశ్రాంతి జీవితం గడిచి పోతున్నదని, 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి విన్నవించు కోగా 2007 సంవత్సరంలో చట్ట సవరణ చేసి దేవాలయ జూనియర్ అసిస్టెంట్కు గ్రేడ్ కార్య నిర్వాహణా ధికారులుగా పార్టీ 40% ఇచ్చేలాగున ఆమోదం ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు అయినప్పటికీ 2022 వరకు సదరు చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల ఆలయ సిబ్బందికి నష్టం వాటిల్లగా డబ్ల్యూ. పి.నెం. 22831/2022, హైకోర్టు నందు కేసు దాఖలు చేసి ఉన్న పోస్టుఅన్ని( డైరెక్ట్ కోటా తో సహా) దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసి జూనియర్ అసి స్టెంట్స్ భర్తీ చేయవలసిందిగా కోరుచూ, పిటిషన్ దాఖలు చేసి ఉ న్నామని, ఆంధ్రప్ర దేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న డైరెక్ట్ కోటా పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల తో భర్తీ చేయాలని తీర్పు ఇచ్చిందని, సదరు తీర్పు ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారు మిగిలిన ఖాళీలను జూనియర్ అసిస్టెంట్ తో భర్తీ చేయదలిచితిరి,, మరియు 60 పోస్టులను డైరెక్ట్ కోటా ఏపీపీఎస్సీ ద్వారా నియామక పరీక్షలు నిర్వహించి వారికి నియామకం కొరకు ఉత్తర్వులు జారీ చేయుటకు సిద్ధంగా ఉన్నదని అందువల్ల నిరుద్యోగులకు ఎటువంటి నష్టం జరుగుట లేదని కానీ దేవాలయాల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్స్ కు గ్రేడ్ కార్య నిర్వహణాధికారులుగా ఇవ్వకూడదనే దురుద్దేశంతో పేపర్ నందు అవాస్తవములు రాయుచు న్నారని కమిషనర్ ని అగౌరపరు స్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలనెం. 27/ ఓఎస్ డి సిఎస్ 2023 ఫిబ్రవరి 1 తేదీ ప్రకారం అన్ని శాఖలలో ఉ న్న పోస్ట్ అన్ని తాత్కాలిక ప్రాతిపదికన ఆయా డిపార్ట్మెంట్స్ లో పనిచే యుచున్న సిబ్బందిచే భర్తీ చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారని, మరియు ఏపీపీఎస్సీ వారికి కేటా యించిన పోస్ట్స్ కూడా ప్రస్తుతానికి ఆయా డిపార్ట్మెంట్ లోపనిచేయుచున్న వారితో భర్తీ చేయమని ఆదేశాలు ఇచ్చి ఉ న్నారని అన్నారు. ఈ కార్య క్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సంక్షేమ సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News