విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరచిన విధంగా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతి పైన నియమింపబడిన ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరణ చట్టబద్ధంగానే జరిగింది. అని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత సర్వీసులను పరిగణలోనికి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరై చేస్తామని చెప్పిన హామీకి కట్టుబడి క్రమబద్ధీకరణ ప్రక్రియను ముందుకు తీసుకుని ప్రస్తుత ప్రభుత్వం ముందుకు వెళుతుండగా ఈ విధానం తప్పు అని కొన్ని పత్రికలు తప్పుగా వాస్తవాలకు విరుద్ధంగా ప్రచురిస్తున్నాయని అయితే వారు చెప్పిన విధంగా ఇవన్నీ అవాస్తవాలు వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం తెలియజేశారు సమావేశంలో వారు మాట్లాడుతూ ఆర్టికల్ 16 గురించి సుప్రీమ్ తీర్పు పేరా 38 లో స్పష్టం చేసిందని దీనిని అనుసరించి క్రమబద్ధీకరణకు అర్హుల రాజ్యాంగ విరుద్ధంగా 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంది. మొదట నోటిఫికేషన్ ఇవ్వడం, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరించడం, అనుభవజ్ఞులైన ఎంపిక కమిటీని ఏర్పాటు చేయడం, తదుపరి వ్రాత పరీక్ష ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా, ఏదైనా మెరిట్ ప్రాతిపదికన నేషనల్ కైటీరియాద్వారా, నియామకాలు జరిగితే అవి రాజ్యాంగ బద్దంగా జరిగినట్టేఅని, అధికరణం16 ద్వారా నిబంధనలు పాటించి ఉద్యోగాలు పొందిన పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ క్రమబద్ధీకరణకు అర్హులేని అన్నారు . ప్రభుత్వం క్రమబద్ధీకరణలో అనుసరించిన విధానం కరెక్టేనని ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని ఇచ్చిన హామీ మేరకు చట్టబద్ధంగా క్రమ బద్దీకరణ చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాంట్రాక్టు ఉద్యోగులు రుణపడి ఉంటామని అన్నారు ..ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ కె రత్నాకర్ బాబు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ చైర్మన్ ఎస్ దొరబాబు, ఎపీఎస్సీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఇవిఎన్విఆర్ కిషోర్, ఏపీ డీఎస్సీ ఎంపీ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ వై. మోహన్ రావు, కాంట్రాక్టు ఉద్యోగులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News