విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్‌లో ముందుస్తు నాట్లపై రైతులకు అవగాహన కల్పించి, రైతు భరోసా కేంద్రాలలో విత్తనాలు ఎరువులు క్రిమిసంహారికా మందులను సిద్దంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో జగనన్నకు చెబుదాం` 1902, గడప గడపకు మన ప్రభుత్వం పనులు, ఎంజిఎన్ఆర్ఈజిఎస్ పనులు, లేబర్ బడ్జెట్, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు, డా.వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల భవన నిర్మాణాలు, జగనన్న హౌసింగ్ ప్రోగ్రాం, వ్యవసాయం మరియు నీటి విడుదల, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
నగరంలోని కలెక్టరేట్ విడిద కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నల్ దినకర్ పుడ్కర్, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, డిఆర్వో కె. మోహన్‌కుమార్,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీడియోకాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ డిల్లీరావు మట్లాడుతూ జగనన్నకు చెబుదాం 1902లో నమోదు అవుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాన్నారు. ప్రతీ రోజు లాగిన్ ఒపెన్ చేసుకుని పరిశీలించుకోవాలన్నారు. సమస్యలను సావదానంగా విని అర్థం చేసుకోవాలన్నారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారు చెప్పే సమస్యను ఓర్పుగా విని పరిష్కార మార్గం చూపాలన్నారు. వారి సంతృప్తి చేందే విధంగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఈసందర్భంగా జగనన్నకు చెబుదాం 1902 లో వచ్చిన ఫిర్యాదుదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను విని పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఖరీఫ్‌లో రైతులు ముందస్తు నారుమడులు వేసేలా ప్రోత్సహించాలన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద సిద్దంగా ఉంచుకోవాలన్నారు. విత్తనాల నాణ్యతను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని నాణ్యత లోపించినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఖరీఫ్‌లో ఇ`క్రాప్ బుకింగ్ నమోదు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు సిద్దంగా ఉండాలన్నారు. నకిలీ విత్తనాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విజిలెస్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
సమావేశలో డిఆర్డిఏ పిడి కె. శ్రీనివాస్, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జె. సునీత, హౌసింగ్ పిడి రజినీ కుమారి, పంచాయతీ రాజ్ ఎస్ఇ ఎ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్ఇ సిజెహెచ్ ప్రసాద్‌బాబు వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News