జగనన్న లే అవుట్లలో గృహ నిర్మాణాల ప్రగతిపై వారం వారం లక్ష్యాలు సాధించాలి..

-నిర్మాణ పనులలో వెనుకబడిన మండల అధికారులపై చర్యలు తప్పవు..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గృహ నిర్మాణాలలో ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, ఎఇ స్థాయిలో పర్యవేక్షణ చేయడంతో పాటు ప్రతిరోజూ సమీక్షించి గృహా నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌. ఢల్లీిరావు అన్నారు.
జిల్లాలో జగనన్న గృహ నిర్మాణాలు, జగనన్న పాలవెల్లువ, జగనన్నకు చెబుదాం, జగనన్న విద్యా కానుక, వైఎస్సార్‌ బీమా, జిఎస్‌డబ్ల్యుఎస్‌, నాడు – నేడు పనుల ప్రగతి స్పందన అర్జీల పరిష్కారం పై స్థానిక కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి బుధవారం జిల్లా కలెక్టర్‌ యస్‌. ఢల్లీిరావు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్‌ లో కలెక్టర్‌ ఢల్లీిరావు మాట్లాడుతూ జగనన్న కాలనీలోని గృహ నిర్మాణాల పనులు పూర్తిచేయడంలో వెనుకబడిన మండల అధికారులు ఎఇలతో తరచు సమీక్ష జరపాలని, బేస్‌మెంట్‌ స్థాయి నుండి ఆ పై స్థాయి వరకు నిర్మాణంలో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గుత్తేదారులు పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేసినప్పుడే పనులు వేగవంతం అవుతాయన్నారు. సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమీషనర్ల నుండి మండలవారి పనుల ప్రగతిపై కలెక్టర్‌ అరా తీశారు. జగనన్న విద్య కానుకలో ఇంకనూ పంపిణీ కాని కిట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈనెల 23వ తేది నుండి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మండలానికి రెండు టీమ్‌లుగా ఏర్పాటు చేసుకుని విజయవంతం చేయాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే ఫిర్యాధులపై మండల అధికారులు ఫిర్యాదుదారుడు సంతృప్తి చేందే విధంగా స్పందించాలని కలెక్టర్‌ ఢల్లీిరావు అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌ లో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, సబ్‌కలెక్టర్‌ అదితి సింగ్‌, ఆర్‌డివో ప్రసన్నలక్ష్మి, రవీంద్రరావు, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్‌, హౌసింగ్‌ పీడి రజిని కుమారి, ఇఇ రవికాంత్‌, ఐసీడీస్‌ పీడీ జి. ఉమాదేవి, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్‌ ఆఫీసర్‌ కొడాలి అనురాధ, జిల్లా మున్సిపల్‌ కమిషనర్లు, మండల స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపిడివోలు, తహాశీల్థార్‌లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *