
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల పింఛను అప్డేషన్ మరియూ ఇతర డిమాండ్ల సత్వర పరిష్కారం కోరుతూ బుధవారం గాంధీనగర్, ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. ఈ ధర్నాకు అల్ ఇండియా బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ కాన్ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ కే .సూర్యనారాయణమూర్తి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కే బీ జీ తిలక్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఉప్పు సుధాకర్, ఇతర అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరై సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. పింఛను చట్టం 35(1) అనుసరించి కేంద్ర ప్రభుత్వ/ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత ఉద్యోగుల పింఛను తరహాలోనే సత్వర పింఛను అప్డేషన్, 2002 నవంబర్ కు పూర్వం రిటైర్ అయిన విశ్రాంత ఉద్యోగులకు నూరుశాతం కరువు భత్యంతో లెక్కించిన పింఛను అమలు, బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య భీమా పూర్తి ప్రీమియం సదరు బ్యాంకులు చెల్లించేలా ఆదేశాలు, బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల పింఛను గణనలో 10వ ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో ప్రవేశ పెట్టబడిన ప్రత్యేక అలవెన్స్ ను పరిగణించుట, సమాలోచన, సలహా సంఘాలలో బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల సంఘాలకు స్థానం కల్పించుట., తదితర న్యాయమైన డిమాండ్ల సత్వర పరిష్కారము కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖాధికారులకు మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఛైర్మన్ కి ఈమెయిల్ ద్వారా మెమొరాండం సమర్పించారు.విజయవాడ, గుంటూరు, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం మరియు సమీప పట్టణాలనుండి సుమారు 200 మంది బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులు ఈ ధర్నా లో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News