గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చే సమస్యలపై దృష్టి సారించాలి

-పౌర సరఫరాల శాఖాధికారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో పౌర సరఫరాల శాఖ అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారంపై సుధీర్ఘంగా చర్చించారు. ఇప్పటివరకు 70 సచివాలయాల పరిధిలో పర్యటించడం జరిగిందని.. ఆయా సచివాలయాలకు సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్(ATR) ను వారంలోగా సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తూ.. కార్డులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై వీఆర్వోలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అలాగే పౌరసరఫరాల శాఖ అధికారులు సచివాలయాలను తరచు సందర్శిస్తుండాలని సూచించారు. ఆయా సచివాలయాల పరిధిలో బియ్యం కార్డులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్డులను విడగొట్టే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రేషన్‌ వెహికల్ ప్రతి ఇంటికీ వెళ్లాలని.. వాహనం ఎప్పుడు వస్తుందనే సమాచారం కూడా ముందుగానే అందించాలని తెలిపారు. వేలిముద్రలు, ఐరీస్ పడని వారి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించి.. సరుకులను పంపిణీ చేసే విధంగా చూడాలన్నారు. దేశంలోనే ఇంటి వద్దకు రేషన్ అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని.. ఆ మేరకు ప్రభుత్వ లక్ష్య సాధనకై అధికారులు, సిబ్బంది పనిచేయాలని కోరారు. సమీక్షలో డీఎస్ఓ రామ్మోహన్ రావు, ఏఎస్ఓ ధనుంజయరెడ్డి, ఏఎస్ఓ(ఇంఛార్జి) శ్రీలక్ష్మి, ఆర్ఐలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *