-జగనన్న ఆణిముత్యాలు అవార్డుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఆదర్శనీయమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని A.K.T.P.M. ప్రభుత్వ పాఠశాల నందు ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డుల ప్రదానోత్సవం విజయవాడ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి తోట వెంకట నాగేంద్ర కుమార్ అధ్యక్షతన గురువారం జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డి, స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి మల్లాది విష్ణు పాల్గొన్నారు. తొలుత పాఠశాల ఆవరణలోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట సత్కరించుకోవడం సంతోషదాయకమన్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం స్థాయిల్లో విడివిడిగా జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేయడం జరుగుతుందన్నారు. పదో తరగతి టాపర్లకు మొదటి బహుమతిగా రూ. 15 వేలు., రెండో బహుమతిగా రూ. 10 వేలు., మూడో బహుమతిగా రూ. 5 వేలు.. ఇంటర్మీడియట్ లో రూ. 15 వేలు చొప్పన నగదును అందజేయడం జరుగుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి పదవ తరగతిలో AKTPM స్కూల్ కి చెందిన జోయల్ సుమంత 590 మార్కులు సాధించి.. రాష్ట్రస్థాయిలో 5వ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని మల్లాది విష్ణు అన్నారు. V.V.సుబ్బారెడ్డి స్కూల్ కి చెందిన ప్రణతి సాయి 584 మార్కులతో నియోజకవర్గ స్థాయిలో రెండో స్థానంలో ఉండగా.. AKTPM స్కూల్ కి కె.గగన్ సాయి 574 మార్కులు సాధించి మూడో స్థానంలో నిలిచారన్నారు. ఇంటర్మీడియట్ లో SRR & CVR కాలేజీకి చెందిన ఎస్.ప్రేమ్ చంద్(MPC) 959 మార్కులు., ఎం.జితేంద్ర (BIPC) 947 మార్కులు., డి.డేవిడ్ రాజు(HEC) 885 మార్కులు., పాయకాపురం GJC కాలేజీకి చెందిన కూరపాటి శ్రీనిష(CEC) 908 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరచడం జరిగిందన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా విద్యార్థులు చదువులో రాణించాలని మల్లాది విష్ణు ఆకాంక్షించారు. అలాగే ఈ నెల 17న జిల్లా స్థాయిలో., 20న రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాలకు పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి, వారికి బంగారు భవిష్యత్తును అందించాలనే కృతనిశ్చయంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మల్లాది విష్ణు తెలిపారు. నాలుగేళ్లలో విద్యారంగానికి అక్షరాలా రూ.60,329 కోట్లు ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. అనంతరం విద్యార్థులను మెడల్స్ తో సన్మానించి నగదు బహుమతిని అందజేశారు. తల్లిదండ్రులను శాలువాలతో, విద్యాలయాల ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్లను మొమెంటోలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో AKTPM పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, SRR & CVR ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సరళ కుమారి, పాయకాపురం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ S.S.N.రెడ్డి, V.V.సుబ్బారెడ్డి పాఠశాల హెడ్ మాస్టర్ కె.వి.దుర్గారావు, సిబ్బంది యల్లాప్రగఢ సుధీర్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News