జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 23వ తేదీ జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమానికి అధికారుల బృందాన్ని సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు కు వివరించారు.
ఈ నెల 23వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణ పై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ విడిది కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ నుండి జూలై 23వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమానికి అధికారులతో కూడిన టీములను సంసిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 605 సచివాలయాలు ఉన్నాయని వీటిలో 305 సచివాలయాలు అర్బన్ పరిధిలోనూ, 275 సచివాలయాలు రూరల్ పరిధిలోనూ ఉన్నాయన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 286 సచివాలయాలను ఆరు టీములు రోజుకు నాలుగు సచివాలయాల పరిధిలోని గృహాలను 12 రోజులు ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అక్కడ ఇంకా ఎవరికైన అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నరా వివిధ రకాల సర్టిఫికెట్లు ను పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా అనే అంశాలను నిశితంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంటారన్నారు.
మండల స్థాయిలో ఎంపిడివోలు, డిప్యూటీ తహశీల్ధార్ ఒక బృందంగాను, తహశీల్దార్, పంచాయితీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కలిసి రెండోవ బృందంగా గ్రామాలకు వెళ్లి పర్యటిస్తారన్నారు. సచివాలయానికి వచ్చే తేదీ వివరాలు ముందే నిర్ణయించి అప్పటిలోగా గ్రామంలో ఉన్న క్షేత్రస్థాయి సిబ్బంది మొత్తం ప్రక్రియ పూర్తీ చేస్తారన్నారు. పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమీషనర్ సిబ్బంది ఒక బృందంగా, జోనల్ కమీషనర్ లేదా డిప్యూటీ కమీషనర్ సిబ్బంది రెండోవ బృందంగా ఏర్పడి వార్డులలో పర్యటిస్తారన్నారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు ప్రభుత్వ పథకాలు అర్హతలు తదితరాలకు సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారన్నారు. సమస్యలున్న వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికీ అవసరమైన సర్టిఫికెట్లు డాక్యూమెంట్లు అన్ని అందిస్తారన్నారు. తద్వారా సమస్యలు మళ్ళీ ఉత్పన్నం కాకుండా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఢిల్లీరావు ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, జాయింట్ సెక్రటరీ డా. నారాయణ్ భరత్ గుప్తా కు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి కొడాలి అనురాధ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *