ఈ నెల 27 కల్లా ఈ- KYC పూర్తి చేసుకోవాలి

-అమ్మఒడి లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరూ చదువుకోవాలనే ఉన్నతాశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అర్హులైన విద్యార్థులందరికీ పథకం వర్తించేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు వెల్లడించారు. నాలుగో విడత అమ్మఒడికి సంబంధించి లబ్ధిదారులు ఈ నెల 27 కల్లా EKYC పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. EKYC పూర్తైన లబ్ధిదారులకు జూన్ 28 నుంచి పథకం కింద లబ్ది చేకూరుతుందని స్పష్టం చేశారు. కాగా ఈ నెల 28న పార్వతీపురం జిల్లా కురుపాంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో పథకం కింద రూ. 13,000 నగదును జమ చేయనున్న విషయం తెలిసినదే.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *