జాతీయ జెండాని గౌరవించడం ప్రతి ఒక్కరి భాధ్యత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ జెండాని గౌరవించడం ప్రతి ఒక్కరి భాధ్యత అని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. జిన్నా టవర్ వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ జెండా వర్షంలో తడిచి, రద్దీ కూడలిలోని వాయు కాలుష్యం వలన దుమ్ము పట్టి ఉండుట పై పలు పత్రికలు, మాజీ సైనికుల, రాజకీయ పార్టీల ప్రతినిధుల ఫిర్యాదు మేరకు స్పందించి శుక్రవారం నూతన జెండాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు జిన్నా టవర్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండా దుమ్ము అంటి ఉన్నదని పలువురు ఫిర్యాదు చేశారని, వెంటనే పాత జెండా స్థానంలో నూతన జెండాను శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దుమ్ము పట్టి ఉండడం నగరపాలక సంస్థకు ఫిర్యాదు అందిన వెంటనే యుద్దప్రాతిపదికన ఇంజినీరింగ్ అధికారుల ద్వారా జెండాను కిందకు దించి, నూతన జెండాను హైదరాబాదు నుండి తెప్పించి శుక్రవారం ఏర్పాటు చేశామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *