విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి ప్రివెన్షన్ యూనిట్ ఫర్ మైగ్రెంట్స్ వారు వలస కార్మికుల కొరకు మేఘా ఇంజినీరింగ్ వర్క్సు నందు ఉచిత వైద్యశిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ వి.రాజా మోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి వారి సహకారంతో గత 15 సంవత్సరాల నుండి యన్.టి.ఆర్ జిల్లాలోని 11 మండలాలు, కృష్ణా అర్బన్ లోని వలన కార్మికుల కొరకు వాసవ్య పనిచేస్తుందన్నారు. వీరికి సాధారణ అనారోగ్య సమస్యలతో పాటు హెచ్.ఐ.వి, సుఖవ్యాదులు, క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు మేఘా ఇంజినీరింగ్ వర్క్సు నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని, సిబిరానికి వచ్చిన 85 మందిని పరీక్షించి సాధారణ అనారోగ్య సమస్యలకు, రక్తపోటు, థైరాయిడ్ పరీక్షలను చేయడం, కంటి పరీక్షలకు ఉచితంగా మందులను అందజేయటం జరిగిందని అన్నారు. అంతేకాకుండా వలస కార్మికులకు సి.పి.ఆర్ పై శిక్షణను రాదిక అశోక్, కొఆర్డినేటర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, యన్.టి.ఆర్ జిల్లా, అందించారన్నారు. అనంతరం మేఘా కంస్ట్రక్షన్ సిబ్బంది కార్మికులు 25 యూనిట్ల రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఈ వైద్యశిబిరం లో మేఘా కంపక్షన్స్ జనరల్ మేనేజర్ జి.చంద్రశేఖర్, సేఫ్టీ మేనేజర్లు జి.రజా సుధాకర్, యస్.కె ముఫ్తార్, డాక్టర్ కె.ప్రదీప్ కుమార్, విజయవాడ సర్వజన ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ నుండి డాక్టర్ శ్రీనివాస్, శిబ్బంది, ఫిరోజ్ – ఆప్తమెట్రిస్ట్, సుభాషిని – ఏ.యన్.యం,ఆరోగ్య కార్యకర్తలు విజయానంద్, పీర్ ఎడ్యుకేటర్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News