నగరంలో నూతనంగా స్వర్ణ స్కాన్స్‌ ప్రారంభం


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ఇమేజింగ్‌ రంగంలో మరో నూతన అధ్యాయం ‘స్వర్ణ స్కాన్స్‌’ ను ఆదివారం సూర్యారావుపేట, కోవెలమూడివారి వీధిలో ఆంధ్రహాస్పిటల్స్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.పి.వి.రమణ మూర్తి ప్రారంభించారు. డా.సి.అమర్నాథ్‌, డా.వై.జ్యోత్స్న, డా.జి. ఈశ్వర్‌, డా.జి.వి.మోహన్‌ప్రసాద్‌, డా.పి.దుర్గాప్రసాద్‌, డా.కె. ప్రభాదేవి ఇమేజింగ్‌ సెంటర్లోని వివిధ విభాగాలను ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో స్కానింగ్‌ సెంటర్‌ డైరెక్టర్లు, ప్రముఖ రేడియాలజిస్టులైన డా.వి.ఎన్‌.వరప్రసాద్‌, డా.ఎస్‌.రమ్య, డా.కె. సుషేన్‌కుమార్‌, డా.బి.సోహైల్‌, డా.బి.శేషులక్ష్మి, డా.కృష్ణమోహన్‌ మరియు విజయవాడ నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెంటర్‌ డైరె క్టర్‌ 25 సంవత్సరాల అనుభవంగల ప్రముఖ రేడియాలజిస్ట్‌ డా.వి.ఎన్‌.వర ప్రసాద్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతంలో ‘ఆరోగ్యరక్షణ’లో సమూలమార్పుకు శ్రీకారం చుట్టడానికి తమ ఈ నూతన ఇమేజింగ్‌ సెంటర్‌ నందు అత్యుత్తమ డయాగ్నస్టిక్‌ సేవలకై అత్యంత అధునాతన పరికరాలను ఏర్పాటుచేసినట్లు, తమ సెంటర్‌ నందు నిష్ణాతులైన మరియు అనుభవజ్ఞులైన రేడియాలజిస్ట్లు సేవలను అందించడానికి సిద్ధంగా వున్నట్లు తెలిపారు. తమ స్వర్ణ స్కాన్స్‌ నందు వైద్యరంగంలో వచ్చిన అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెప్పిన సమయానికి ఖచితమైన డయాగ్నస్టిక్స్‌ ఇమెజింగ్‌ సేవలను అందించాలన్నదే తమ ప్రాధమిక లక్ష్యమని తెలుపుతూ, తామందించిన ఖచితమైన రిపోర్టుల ఆధారంగా డాక్టర్లు తమ రోగులకు మరింత మెరుగైన సేవలను అందిచవచ్చునని తెలిపారు.
ఈ సెంటర్‌ నందు హై రెజల్యూషన్‌, డిజిటల్‌ ఎక్స్‌-రేలు, ఎలక్ట్రోగ్రఫీతో కూడిన 3డి మరియు 4డి అల్ట్రాసౌండ్‌ ఇమేజింగ్‌, 1.5 టెస్లా, పూర్తిస్థాయి డిజిటల్‌ ఎమ్‌ఐ, 160 స్లైస్‌ కార్డియాక్‌ మరియు హోల్‌ బాడీ కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ (సిటి) స్కాన్‌, డిజిటల్‌ మామోగ్రఫీ మరియు బ్రెస్ట్‌ ఇమేజింగ్‌, ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ ప్రొసీజర్‌ లభించు సేవలున్నాయని వివరించారు. విజయవాడ మరియు పరిసరప్రాంత ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకో వాలని డా.వరప్రసాద్‌ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *