తప్పులు లేని ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని భూత్‌ స్థాయి అధికారులు పక్కాగా నిర్వహించి తప్పులు లేని ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు.
ప్రత్యేక సంక్షిప్త సవరణ -2024లో భాగంగా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంటింటి సర్వేపై భూత్‌ స్థాయి అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని గురువారం తిరువూరు లోని టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా ఆగస్టు 21వ తేది వరకు నిర్వహించే డోర్‌టు డోర్‌ వెరిఫికేషన్‌ పై బూత్‌ స్థాయి అధికారులు ఎన్నికల కమీషన్‌ నిబంధనలపై అవగాహన కల్పించుకుని క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబిత తనిఖీ పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారదర్శక ఓటర్ల జాబితాతోనే నిర్థారణతోనే పోలింగ్‌ శాతం పెరుగుతుందన్నారు. రాబోయే 9 నెలలలో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆగస్టు 24వ తేది నాటికి తుది జాబితా పూర్తి చేయాలన్నారు. గతంలో ఓటు నమోదైన తరువాత మరణించిన, వివిధ కారణాలతో ఒక ప్రాంతం నుండి మరోక ప్రాంతానికి వలస వెళ్ళిన, ఒకే డోర్‌ నెంబర్‌పై పలు ఓట్లతో తప్పుగా నమోదు అయిన, తప్పుడు డోర్‌ నెంబర్లతో నమోదైనా ఓటర్ల వివరాలను భూత్‌ స్థాయి అధికారులు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ చేర్పులు, తొలగింపులలో భూత్‌ స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదును ఫామ్‌ 6 ద్వారాను, 6 ఏ ద్వారా చిరునామా, నియోజకవర్గాల మార్పులపై ఫామ్‌ 8 ఏ, మరణించిన ఓటర్లను ఫామ్‌ 7 ద్వారా తొలగించడం, తదితర ధరఖాసులపై భూత్‌ స్థాయి అధికారులు అవగాహన ఉండాలన్నారు. ఓటర్ల నమోదు కోసం వస్తున్న ధరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి వివరాలను పోర్టల్‌ లో నవీకరించి పరిశీలించడం చేయాలన్నారు. కొత్తగా చేర్చవలసిన యువ ఓటర్ల నమోదు కోసం 18`19 మధ్య వయసు ఉన్న వారిని, 17 సంవత్సరాల వయస్సు దాటిన వారికి ప్రతీ 3 నెలలకు ముందస్తుగా ఫారం 6 ను తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.

శిక్షణా కార్యక్రమంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, ఆర్‌డివో వై. వి.ప్రసన్న లక్ష్మి, కోఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరిండెంటెంట్‌ సిహెచ్‌ దుర్గాప్రసాద్‌, తిరువూరు నియోజకవర్గ బిఎల్‌వోలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *