అభిలషణీయ బ్లాక్‌ పథకం (ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాం)లో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభిలషణీయ బ్లాక్‌ పథకం (ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాం)లో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాలను (బ్లాక్స్‌ను) అత్యుత్న స్థాయికి తీసుకువచ్చేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు నీతి ఆయోగ్‌ ఉన్నతాధికారులకు వివరించారు.
అస్పిరేషనల్‌ డిస్టిక్ట్‌ ప్రోగ్రాం (ఏడిపి)లో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం ఢల్లీి నుండి నీతి ఆయోగ్‌ ఉన్నతాధికారులు వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నీతి అయోగ్‌ ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఈనెల 30వ తేదిన ఢల్లీిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్ప సత్తాప్‌ా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, ప్రగతి మైదాన్‌ నుండి ప్రధాన మంత్రి అభిలషణీయ బ్లాక్‌ పథకం (ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాం) పై దేశ వ్యాప్తంగా సందేశాన్ని ఇవ్వనున్నారన్నారు.ఈ సందర్భ్‌ంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఎంపిక చేసిన ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాలలో ప్రత్యక్ష ప్రసారానికి అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు.ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలా(బ్లాక్స్‌) లలో నీతిఆయోగ్‌ నిర్థేశించిన విధి విధానాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. ఎంపిక చేసిన రెండు బ్లాక్‌లు అభివృద్ధి చెందిన అర్బన్‌ బ్లాక్‌ దగ్గరగా ఉన్నందున ఆస్థాయిలో అత్యుత్తమ బ్లాక్‌లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్టోబర్‌ 3వ తేది నుండి 9వ తేది వరకు సబ్కీ ఆకాంక్షేయిన్‌ సబ్‌కా వికాస్‌ కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్టోబర్‌ 3వ తేదిన సంపూర్ణ స్వస్త్య` ఏక్‌ సంకల్ప్‌ లో భాగంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్స్‌ కేంద్రాల వద్ద ఇమ్యూనైజేషన్‌ డ్రైవ్‌, రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనత శాతాన్ని పరిశీలించడం నిక్షయ్‌ మిత్ర కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీని నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్టోబర్‌ 4వ తేదిన అంగన్‌ వాడీ కేంద్రాలలో పోషణ్‌ మేళా కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులలో ఆరోగ్య కర ఎదుగుదలను పరిశీలిస్తామన్నారు. అక్టోబర్‌ 5వ తేదిన గ్రామ పంచాయతీలలో పారిశుద్ద్యం, స్వచ్చత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్టోబర్‌ 6వ తేదిన పంచాయతీ భవనంలో వర్క్‌ షాపులు, సెమినార్‌లు, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ ప్రదర్శనలు, వ్యవసాయ పర్యటనలు ఫార్మ`టు టేబుల్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌, గోబర్‌ ధన్‌. బయో వ్యవసాయ వనరులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్టోబర్‌ 7వ తేదిన ప్రాధమిక, ప్రాధమిక ఉన్నత పాఠశాలలో డిజిటల్‌ అక్షరాస్యత పై వ్యాస రచన, పెయింటింగ్‌ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్టోబర్‌ 8వ తేదిన ప్రధాన మంత్రి విశ్వ కర్మ పథకం పై అవగాహన డిజిటల్‌ మార్కెటింగ్‌ పై శిక్షణ, ఆర్థిక అక్షరాస్యత, ఈ కామర్స్‌ కార్యక్రమాలు అక్టోబర్‌ 9వ తేదిన వ్యవసాయ ఉత్పత్తులపై ప్రదర్శనలు, ఉత్తమ అభ్యాసాలు, కార్యాచరణ కిమోస్క్‌లు, ఉత్తమ ఫీల్డ్‌ ఫంక్షనరీలకు అన్ని రంగాలకు బహుతి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ డిల్లీరావు నీతి అయోగ్‌ ఉన్నతాధికారులకు వివరించారు.వర్చువల్‌గా నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో సిపివో వై శ్రీలత, ఎంపిడివోలు బివి రామకృష్ణనాయక్‌, ఎస్‌వి ప్రసాద్‌లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *