సమస్యకు పరిష్కారమే “జగనన్నకు చెబుదాం”అంతిమ లక్ష్యం

-సమస్యకు పరిష్కారమే “జగనన్నకు చెబుదాం”అంతిమ లక్ష్యం
-మొవ్వలో “జగనన్నకు చెబుదాం” నిర్వహించిన కలెక్టర్

మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపి వారిలో సంతృప్తి స్థాయి పెంపొందించేందుకు ప్రభుత్వం” జగనన్నకు చెబుదాం” ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు.”జగనన్నకు చెబుదాం” మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం బుధవారం స్థానిక మండవ జానకి రామయ్య క్షేత్రయ్య కళ్యాణ మండపం నందు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజత సింగ్, పామర్రు శాసనసభ్యులు కైలె అనిల్ కుమార్, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు కలెక్టరేట్ వరకు రాకుండా, మండలంలోనే అధికారులతో కలిసి “జగనన్నకు చెబుదాం” కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ మేరకు జిల్లాలో ప్రతి బుధవారం, శుక్రవారం మండల స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు మొవ్వలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పరిష్కారానికి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో మాట్లాడి, సెల్ఫీ తీసుకుని, తగిన విచారణ నిర్వహించి, నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులే గ్రామాలకు వెళుతున్నందువల్ల ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందన్నారు.ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మండల పరిధిలో నిడుమోలు, మొవ్వ, చినముత్తేవి, ఆవురుపూడి వంటి గ్రామాల నుంచి ఎక్కువగా రోడ్లు త్రాగునీరు సమస్యలపై అర్జీలు అందాయన్నారు.పామర్రు శాసనసభ్యులు అనిల్ కుమార్ మాట్లాడుతూ అధికారులను గ్రామాలకు పంపి పరిపాలన ప్రజలకు మరింత చేరువుగా చేయడానికి సమస్యల సత్వర పరిష్కారానికి జగనన్నకు చెబుదాం, గడపగడప, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలకు జగనన్న శ్రీకారం చుట్టారని, నూతన పరిపాలన విధానానికి ఇదే నిదర్శనం అన్నారు.తొలుత జాయింట్ కలెక్టర్ మొవ్వ మండలంలో జగనన్నకు చెబుదాం పెండింగ్ అర్జీలతోపాటు, రీఓపెన్ కేసులు, అసంతృప్తి కేసులకు సంబంధించి అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించారు.మండలంలో జగనన్నకు చెబుదాంలో రీ ఓపెన్, అసంతృప్తి కేసులలో సంబంధిత అధికారులు తీసుకున్న చర్య నివేదిక సమావేశంలో వివరించారు.జగనన్నకు చెబుదాం పెండింగు కేసులు అన్నీ కూడా వెంటనే విచారించి సరైన సమాధానం పంపాలన్నారు.జగనన్నకు చెబుదాం” అర్జీలు నిడుమోలు గ్రామంలో ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, సిసి రోడ్లు నిర్మించాలని, నాడు- నేడు క్రింద ఎంపీపీ స్కూలు అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని, కాలనీలో అక్కడక్కడ విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని, పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ అర్జీదారు చిన్నం చిన వెంకటేశ్వరరావు అర్జీ సమర్పించగా, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.మొవ్వ మండలంలో ఆవురుపూడి, మంత్రి పాలెం, నిమ్మకూరు, చినముత్తవి గ్రామాల పరిధిలో ఆయకట్టు రైతులు గేదెలకోడు డ్రైన్ పూడిక తవ్వించాలని కోరుతూ మేడిశెట్టి నాగేశ్వరరావు తదితరులు అర్జీ సమర్పించారు. కాజ- కళాయిగుంట గ్రామానికి చెందిన జోనపూడి సునీత తనకు మంజూరైన జగనన్న ఇంటికి గత జనవరిలో బేస్మెంటు, జూలైలో స్లాబ్ వేసుకున్నామని ఇంతవరకు ఒక్క బిల్లు కూడా పడలేదని సమస్య పరిష్కరించాలని అర్జీ సమర్పించారు. మొవ్వ గ్రామానికి చెందిన ఘంటసాల వెంకటేశ్వరమ్మ తన భర్త మరణించారని వైయస్సార్ భీమా ఇంతవరకు రాలేదని అర్జీ సమర్పించారు.అర్జీల నమోదుకు ప్రత్యేకంగా కంప్యూటర్లతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అర్జీదారులు కోసం కుర్చీలు ఏర్పాటు చేసి త్రాగునీటి సౌకర్యం కల్పించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సంపూర్ణ పోషణ శిబిరం ఏర్పాటుచేసి, చిరుధాన్యాలతో తయారుచేసిన వంటకాలు ప్రదర్శించారు. మహిళలకు అవగాహన కల్పించారు.మండల తాసిల్దారు, ఎంపీడీవో కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించారు.డిఆర్ఓ వెంకటరమణ, జడ్పీ సీఈవో జ్యోతి బసు, ఆర్డీవో విజయ్ కుమార్, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ, డి ఆర్ డి ఏ పిడి పిఎస్ఆర్ ప్రసాద్, ఐసిడిఎస్ పిడి ఎస్ సువర్ణ, డిపిఓ నాగేశ్వర నాయక్, డిసిఒ ఫణి కుమార్, డీఈవో తహెరా సుల్తానా, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *