దసరా ఉత్సవాలకు సంబందించి పారిశుధ్య నిర్వహణ పై అధికారులతో సమీక్షా సమావేశం

-24 గంటలు పారిశుధ్య సిబ్బంది అందుబాటులో ఉంచాలి.
-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, గురువారం నగరపాలక సంస్థ ఉన్నత అధికారులతో కలసి దసరా ఉత్సవాలకు సంబందించి పారిశుధ్య నిర్వహణ పై వారి చాంబర్ నందు సమీక్షా సమావేశం నిర్వ‌హించారు.దసరా ఉత్సవాలకు సంబందించి పారిశుధ్య కార్మికులకు 3 షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉంచాలని, మరుగుదొడ్లు మరియు ఆలయల పరిసర ప్రాంతాలు, రోడ్లు, క్యూ లైన్ లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. సిబ్బందికి సకాలంలో భోజన ప్యాకెట్ లు అందించాలని, అదే విధంగా త్రాగునీటి పాయింట్ లను ఏర్పాటు చేసి నిరంతరం భక్తులకు మరియు ప్రజలకు త్రాగు నీరు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. దసరా ఉత్సవాలకు సంబంధించి అధిక మొత్తంలో భక్తులు వచ్చుటకు అవకాశం ఉన్నందున అధికారులకు దిశనిర్దేశాలు ఇస్తూ, అధికారులు అందరు వారికీ కేటాయించిన ప్రదేశాలలో నిరంతర పర్యవేక్షణలో సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు. విధినిర్వహణలో ప్రతి ఒక్కరు విధిగా నిభందనలు పాటించేలా చూడాలని అన్నారు. నగరంలో సీతమ్మవారి పాదాలు, శనీశ్వర స్వామి ఆలయం, భవానిపురం పున్నమిఘాట్ పలు స్నానఘాట్లు, కెనాల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో భక్తులకు మరియు ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలిస్ సిబ్బంది తో సమన్వయము చేసుకొని ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశములో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, అదనపు కమిషనర్(జనరల్) శకుంతల, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యు) వెంకటలక్ష్మి సిటి ప్లానర్ జీ.వి.జీ.ఎస్.వి ప్రసాద్, జోనల్ కమిషనర్ – 1 డా.రవిచంద్, ఎస్.ఇ. డి.నరసింహ మూర్తి, ఎస్టేట్ ఆఫీసర్ టి .శ్రీనివాస్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్లు, హెల్త్ ఆఫీసర్లు, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *