ది ఇంటర్నేషనల్ వియన్నాఎనర్జీ అండ్ క్లైమేట్ ఫోరం కాన్ఫరెన్స్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ది ఇంటర్నేషనల్ వియన్నాఎనర్జీ అండ్ క్లైమేట్ ఫోరం కాన్ఫరెన్స్ లో భాగంగా స్వీడన్ లోని స్వీడిష్ ఎన్విరాన్మెంట్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లను యునిడో ప్రతినిధులతో కలిసి నగర కమిషనర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యర్ధాల నిర్వహణ, క్లీన్ సిటిల పై భాగంగా అక్టోబర్ 29 నుండి నవంబర్ 5 వరకు స్వీడన్, ఆస్ట్రియాల్లో పర్యటిస్తున్న కమిషనర్ స్వీడన్ లోని స్టాక్ హోం లో స్వీడిష్ ఎన్విరాన్మెంట్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్, స్జోస్టాడ్స్వర్కెట్ వాటర్ ఇన్నోవేషన్ సెంటర్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, లను యునిడో ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. రీసర్చ్ ఇనిస్టిట్యూట్, ఎనర్జీ ప్లాంట్ ల్లో వ్యర్ధాల నిర్వహణలో అనుసరిస్తున్న ఆధునిక విధానాలు, వ్యర్ధాలు ఉత్పత్తి అయ్యే నివాసాలు, సంస్థల నుండి ప్లాంట్ లకు వ్యర్ధాలు తరలించడం, కార్మికులతో కాకుండా యంత్రాలతో వ్యర్ధాలను తడి,పొడి, ప్లాస్టిక్, ఇతర వస్తువులుగా వేరు చేయడం, వాటిని తిరిగి ఉపయోగ పడే వస్తువులుగా మార్చే విదానాన్ని పరిశీలించారు. అనంతరం నేరుగా ఇళ్ళ దగ్గర నుండి వ్యర్ధాల సేకరణ చేసే విదానాన్ని పరిశీలించారు. లింకోపింగ్ యూనివర్సిటీ బృందంతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబందించి వివిధ అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *