విద్యలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపాలి

-నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ప్రపంచ సదస్సులో పాఠశాల విద్యా కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ప్రసంగం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యారంగంలో విశేషమైన సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నిలిచిందని, విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపితే మరింత అభివృద్ధి సుసాధ్యమవుతుందని స్కిల్ డెవలెప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ అన్నారు. నెదర్లాండ్స్ లో బుధవారం జరిగిన గ్లోబల్ సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్ఫరెన్స్-2023లో భారతదేశ ప్రతినిధిగా ప్రసంగించారు. ఈ సమావేశానికి దాదాపు 75 దేశాల నుంచి పాల్గొన్నారు. సందర్భంగా సమావేశంలో రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రెజెంటేషన్ చేస్తూ ఇతర దేశాలకు స్పూర్తినిస్తూ సామాజిక, ఆర్థిక విద్య నేషనల్ ఇంటిగ్రేషన్‌పై వ్యూహాత్మక విధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందే విధానాన్ని పంచుకున్నారు.
ఈ సమావేశంలో (Entrepreneurial Mindset Development Programme (EMDP) విజయంతో పాటు, పిల్లలను ప్రపంచ విద్యార్థులను చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల విద్యా శాఖ, సమగ్రశిక్ష చేపట్టిన వివిధ మార్గదర్శక కార్యక్రమాలను వివరించారు. EMDP ప్రభావ మూల్యాంకన అధ్యయనాన్ని ప్రపంచ బ్యాంక్ ఆరు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సహకారంతో నిర్వహిస్తోందని, ఈ మూల్యాంకనం రాష్ట్ర విద్యాభివృద్ధికి ఒక సాహసోపేతమైన చర్యగా నిలుస్తుందని అన్నారు.
ఈ సమావేశంలో Fariza Soltogulova (Chief Specialist Ministry of Education and Science Kyrgyz Republic), Oscar Valverde Cerros (Fundación PANIAMOR), Bénéwendé B. Segueda (Permanent Secretary Strategic Development Plan for Basic & Secondary Education, Ministry of Education Burkina Faso), Dr. Hassan Akram (Chief of Curriculum Development Department Ministry of Education and Technical Education Egypt), Ethel Agnes Valenzuela (Education Advisor ASEAN The Philippines Moderator), ఈఎండీపీ ప్రొగ్రామ్ మేనేజర్ సతీష్ దుల్లా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *