Breaking News

టీబీ వ్యాధిగ్ర‌స్తుల‌కు పౌష్టికాహారానికి కొహాన్స్ లైఫ్‌సైన్సెస్ రూ. 38 ల‌క్ష‌ల ఆర్థిక సహ‌కారం..

-పేద‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు కార్పొరేట్ సంస్థ‌ల స‌హ‌కారం అభినంద‌నీయం.
-జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద‌ల ఆరోగ్య సంక్షేమానికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు తోడు కార్పొరేట్ సంస్థ‌లు అందిస్తున్న స‌హ‌కారం, కృషి అభినంద‌నీయ‌మ‌ని.. టీబీ వ్యాధిగ్ర‌స్తుల‌కు పౌష్టికాహారం అందించేందుకు జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం, ముక్తేశ్వ‌ర‌పురంలోని కొహాన్స్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ సీఎస్ఆర్ కింద రూ. 38 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం అందించేందుకు ముందుకొచ్చింద‌ని.. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పేద‌ల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థ‌లు భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు.
జ‌గ్గ‌య్య‌పేట శాస‌న‌స‌భ్యులు సామినేని ఉద‌య‌భాను ఆధ్వ‌ర్యంలో కొహాన్స్ లైఫ్‌సైన్సెస్ సంస్థ ప్ర‌తినిధులు సోమ‌వారం న‌గ‌రంలోని క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావును క‌లిసి టీబీ వ్యాధిగ్ర‌స్తుల స‌హాయార్ధం రూ. 38 ల‌క్ష‌ల ఆర్థిక స‌హ‌కారం చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు మూడు వేల మందికి పైగా టీబీ వ్యాధిగ్ర‌స్తుల‌ను గుర్తించ‌డం జ‌రిగింద‌ని.. వీరిలో నిరుపేద‌లు సుమారు 700 మందికి ప్ర‌ధాన‌మంత్రి టీబీ ముక్తిభార‌త్ అభియాన్ ప‌థ‌కం కింద రూ. 500 నగ‌దు, పౌష్టికాహారం, మందుల‌ను పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. దీంతోపాటు జిల్లా అధికారులు సుమారు 100 మందికి ఒక్కొక్క‌రికి నెల‌కు రూ. 700 విలువ‌గ‌ల పోష‌కాహార కిట్ల‌ను ఆర్నెల్ల‌పాటు క్ర‌మంత‌ప్ప‌కుండా అంద‌జేయ‌డం జ‌రిగింద‌న్నారు. నిరుపేద‌లైన టీబీ వ్యాధిగ్ర‌స్తుల‌కు మ‌రింత మెరుగైన పౌష్టికాహారాన్ని అందించి క్ష‌య వ్యాధి బారినుంచి విముక్తి క‌లిగించేందుకు కృషిచేస్తున్న‌ట్లు వివ‌రించారు. 2025 నాటికి జిల్లాను టీబీ ర‌హిత జిల్లాగా తీర్చిదిద్ద‌డంలో కార్పొరేట్, స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారం ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. కొహాన్స్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ జిల్లాకు రూ. 38 ల‌క్ష‌లు అంద‌జేయ‌డంతో పాటు మ‌రో రూ. 40 ల‌క్ష‌లు ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీకి అందించేందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం అభినందనీయమన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్పొరేట్‌, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకొచ్చి పేద‌ల ఆరోగ్య‌, ఆర్థిక అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు.
జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఆర్థిక సహ‌కారం చెక్కును అందించిన‌వారిలో శాస‌న‌స‌భ్యులు ఉద‌య‌భానుతో పాటు క‌నెక్ట్ ఆంధ్రా సీఈవో కె.శివ‌శంక‌ర్‌, కొహాన్స్ లైఫ్‌సైన్సెస్ ఆప‌రేష‌న్స్ హెడ్ ఎంఎస్ఎన్ రెడ్డి, సీఎస్ఆర్ హెడ్ పీఎస్ఎన్ మూర్తి, కార్పొరేట్ అఫైర్స్ సీనియ‌ర్ జీఎం బాలాజీ మ‌హేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *