-ఓటు హక్కు ను తప్పనసరిగా వినియోగించు కొండి
-కదలండి.. ఓటు నమోదు చేసి మీ భాద్యత
-నగరంలో ఓటరు నమోదు అవగాహన పై ఎల్ ఈడీ స్క్రీన్ సంచార వాహనం
– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటే వజ్రాయుధం … , ఆ వజ్రాయుధాన్ని వినియోగించు కొనేందుకు అర్హత గల ప్రతి ఓటరు … ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత పిలుపునిచ్చారు.
శుక్రవారం రాజమండ్రి అర్భన్ నియోజకవర్గం నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక వై జంక్షన్ వద్ద స్పెషల్ సమ్మరీ “ స్వీప్” – ఓటరు అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్, ఎలెక్టోరల్ నమోదు అధికారి కె. దినేష్ కుమార్, సహాయ కలెక్టర్ సి . యశ్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఓటరు నమోదు అవగాహన పై ఎల్ ఈడీ స్క్రీన్ తో గల వాహానాన్ని, ర్యాలీ ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత మాట్లాడుతూ ఓటు లేని వ్యక్తులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటరుగా నమోదుకు కావడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉందన్నారు. రాబోయే సాధారణ ఎన్నికలు సందర్బంగా విస్తృత స్థాయిలో స్పెషల్ సమ్మరీ కార్యక్రమం జరుగుతోందని ప్రతి ఒక్కరు తమ ఓటును ఉందో … లేదో సరిచూసుకొని ఓటరుగా నమోదుకు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. 2024 జనవరి 1 నాటికి ఓటరుగా అర్హత కలిగి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు గా నమోదు కావాలని పిలుపు నిచ్చారు. బి ఎల్ ఓ లు కూడా వారి పరిధిలో ఉన్న ప్రతి ఒక్క అర్హత కలిగిన ఓటరును ఓటరుగా నమోదు చేయడం కోసం పని చేయాల్సి ఉందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వడం పారదర్శక విధానంలో రూపొందించిన ఓటరు జాబితా అని తెలియ చేశారు. పారదర్శకత తో కూడిన స్వచ్ఛ ఓటరు జాబితాను సిద్దం చేసేందుకు స్పెషల్ సమ్మరీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఒకవేళ ఓటు లేకపోతే ఫారం 6 ద్వారా నమోదు కావాలని, ఓటరు జాబితా నుంచి పేరు తొలగింపు , మరణించిన వారి కొరకు ఫారం 7 ద్వారా, ఒక నియోజకవరం నుంచి వేరే నియోజవర్గం మార్పు, పాత చిరునామా నుంచి కొత్త చిరునామా, పేర్లు కు మార్పు కొరకు ఓటుర్సు ఫారం 8 ద్వారాను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. పారదర్శకత తో కూడిన ఓటరు జాబితా ఏర్పాటు చేసుకుని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోవడం మనందరి బాధ్యతగా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ముఖ్యమైన ఎనిమిది కూడళ్లలో ” కియోస్కో ” లని ఏర్పాటు చేశామని, ఓటు హక్కు లేని వారు, మార్పులు చేర్పులు కోసం ధరఖాస్తు చేసుకునే వారు, వారి ఓటు హక్కు ఉందో లేదో పరిశీలన చేసుకునే వారు ఈ కియోస్కో లను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంచి ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజా స్వామ్య వ్యవస్థ లో ఓటు వజ్రాయుధం అని, తప్పకుండా వినియోగించు కొవాలన్నారు. కలెక్టరు మాధవీలత ఓటరును చైతన్య పర్చడంతో పాటు వారిని భాగస్వామ్యులను చేసే విధంగా ద్విచక్రవాహనాలకు స్వీప్ కార్యాచరణ పై అవగాహన కల్పించే విధంగా రూపొందించిన కరపత్రాలను స్వయంగా వాహనాలకు అంటించారు.
ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక సమ్మరీ కార్యక్రమం సందర్భంగా ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన ర్యాలీకి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా “ రిజిష్టరు టు ఓటు” “మై ఓటు మై వాయిస్ వై రైట్” “ రైట్ టు ఓటు ఏ ఫండమెంటల్ రైట్” అనే ప్లే కార్డుతో ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ స్పెషల్ సమ్మరీ .. స్వీప్ కార్యాచరణ లో భాగంగా రాజమండ్రి అర్బన్ ప్రాంతంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఓటరు నమోదు పై అవగాహన కల్పించే విధంగా ఎల్ఈడీ స్క్రీన్ వాహనాన్ని జిల్లా కలెక్టరు వారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఓటు మన హక్కుతో పాటు ఓటు యొక్క విలువ ప్రతి ఒక్కరికీ తెలియ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు . జిల్లాలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండడం మాత్రమే కాదు ఓటు ను వేయాల్సి ఉందన్నారు. ఓటు లేని వారు తప్పనిసరిగా ఓటరు గా నమోదు కావాలన్నారు. ఈ మేరకు నగరంలోని పలు చోట్ల కియోస్కీ లను ఏర్పాటు చేసామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టరు సి.యస్వంత కుమార్ రెడ్డి, డిపివో జేవి సత్యనారాయణ, అదనపు కమిషనర్ పి ఎమ్ సత్య వేణి, జిల్లా అధికారులు, కాలేజీ, మునిసిపల్ స్కూల్ విద్యార్థులు, ఆర్ ఎం సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News