Breaking News

సత్ఫలితాలు దిశగా బంగారు కొండ

-తొలి విడతలో దత్తత తీసుకున్న 1283 మంది చిన్నారులు
-సాధారణ స్థితికి వచ్చిన 478 మంది చిన్నారులు
-దత్తత స్వీకారానికి మరింత మంది సహృదయులు ముందుకు రావాలి
కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన బంగారు కొండ కార్యక్రమం ద్వారా 5 నెలల వ్యవధిలో తీవ్ర పౌ స్టి కాహరం లోపం, ఎదుగుదల లోపం ఉన్న 478 పిల్లలను సాధారణ స్థితికి తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం సాయంత్రం “బంగారుకొండ జిల్లా సర్వసభ్య సమావేశం” కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత, జిల్లాలో జూన్ 14 న బంగారు కొండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జూన్ 21 నుంచి తీవ్ర బలహీనంగా, తక్కువ బరువు, వయస్సుకు తగ్గ ఎత్తు, సరైన ఎదుగుదల లేని పిల్లలను 1283 గుర్తించి, వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహరం తో పాటు అదనంగా ఆహారం అందించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 478 మంది చిన్నారులు సాధారణ స్థితికి రావడం ఆనందకర మన్నారు. మరింత మందికి చేయూత నిచ్చే క్రమంలో ఆమేరకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం కావాలని కోరారు. బంగారు కొండ కింద ఎంపిక చేసిన ప్రతి పిల్ల వానికి బంగారు కొండ కిట్స్ అందజేసేందుకు 3 వేలు స్వచ్ఛంద చొప్పున సేకరించి, ఆరు నెలల పాటు కిట్స్ ఇస్తున్నట్లు తెలిపారు. మరింత మంది పిల్లలకు అండగా నిలిచేందుకు ముందుకు రావాలన్నారు.
జిల్లాలో మరో 38 మంది పిల్లలను కొత్తగా గుర్తించినట్లు కలెక్టర్ అధికారులు తెలిపారు.

మరింత మంది పిల్లలను దత్తత తీసుకొని వచ్చేందుకు బాలమిత్రాలుగా ఆసక్తి ఉన్న వారిని గుర్తించాలని ప్రజా ప్రతినిధులు ఆమేరకు అసక్తు6చూపుతున్న దృష్ట్యా సర్పంచులు, ఎంపిటిసి, జెడ్పీ టిసి తదితర వ్యక్తులను కలిసి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

మండల స్థాయి లో సాధారణ స్థితికి వచ్చిన బంగారుకొండ లను అభినందించుటకు గాను ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి, మరింత మందికి స్ఫూర్తి కల్పించాల్సి ఉందన్నారు.

ఈ సమావేశంలో ఐ సి డి ఎస్ పిడి కె. విజయ కుమారీ, డిఎల్ఏ టి ఓ డా ఎన్. వసుంధర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *