రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక మహిళా కారాగారము, రాజమహేంద్రవరం నందు రాష్ట్రములోనే తొలిసారిగా సత్ప్రవర్తన కలిగిన మహిళా ఖైదీలకు సెమిఓపెన్ జైలు (పాక్షిక ఆరుబయలు జైలు)నందు పని చేయుటకుగాను జైళ్ల శాఖాధికారి హరీష్ కుమార్ గుప్త ఆదేశముల మేరకు డాక్టర్ ఐ. శ్రీనివాసరావు, ఇన్ స్పెక్టర్ జనరల్ ఆప్ ప్రిజన్స్, ఆంధ్ర ప్రదేశ్, మంగళగిరి వారు సత్ప్రవర్తన కలిగిన మహిళా ఖైదీలను ఎంపిక చేయు ప్రక్రియ ప్రారంభించినట్లు మహిళలకు ప్రత్యేక జైలు రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ సిహెచ్. వసంత కుమారి తెలియ చేసారు
శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఐ. శ్రీనివాసరావు , ఖైదీలను ఉద్దేశించి సదరు ముద్దాయిలు సెమి ఓపెన్ జైలు నందు పనిచేసినచో వచ్చే మేలు గురించి ముద్దాయిల యొక్క నడవడిక ఏవిధముగా ఉండాలో వారికీ వివరించి చేప్పారు.
ఎం. ఆర్. రవికిరణ్ , డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆప్ ప్రిజన్స్, కోస్టల్ ఆంధ్ర రేంజ్, రాజమహేంద్రవరం వారు, ముద్దాయిల ఎంపిక ప్రక్రియను ప్రారంభించి 65 మంది శిక్ష ఖైదీలలో 27 మంది సత్ప్రవర్తన కలిగిన మహిళా ఖైదీలను ఎంపిక చేసియున్నారు.
ఈ పాక్షిక ఆరుబయలు జైలునందు పాక్షిక వ్యవసాయం, నర్సరీ, డైరీ మరియు పెట్రోలు బంక్ నందు పనిచేయుట మొదలగు పనులు చేయుదురు. ఆరుబయలు జైలునందు పనిచేయు ఖైదీలకు ఎక్కువగా వేతనములు వచ్చును దాని ద్వారా వారు రిలీజు అయిన పిదప వారి యొక్క కుటుంబమునకు ఆర్థికంగా ఎంతగానో దోహద పడును అని అధికారులు తెలిపియున్నారు.
కార్యక్రమములో సిహెచ్. వసంత కుమారి, పర్యవేక్షణాధికారిణి, ప్రత్యేక మహిళా కారాగారం, రాజమహేంద్రవరం వారు కుమారి పావని, జైలర్, కె. సుభాషిణి, డిప్యూటీ జైలర్ మరియు తదితర అధికారులు సిబ్బంది పాల్గొనినారు
Prajavartha Online Telugu News