Breaking News

నెలటూరు సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన హోంమంత్రి తానేటి వనిత

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
చాగల్లు మండలం నెలటూరు గ్రామంలో వేంచేసిన శ్రీ సీతారామ రమ సత్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సందర్శించారు. ఆలయ చైర్మన్ తాళ్లూరి మాధవ్ వెంకట కృష్ణ ఆధ్వర్యంలో హోంమంత్రికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆనంతరం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామి వారి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన హోం మంత్రి పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *