Breaking News

వైయస్సార్ పింఛను కానుక, ఆసరా, చేయూత పంపిణీ కార్యక్రమాలు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమం పై దిశానిర్దేశం

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ పింఛను కానుక, ఆసరా, చేయూత పంపిణీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాలను పండుగ వాతావరణం లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లిలోని వారి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైయస్సార్ పింఛను కానుక, ఆసరా, చేయూత పంపిణీ కార్యక్రమాలు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమం పై దిశానిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో వచ్చే జనవరి 1వ తేదీ నుండి పెంచిన 3000 రూపాయల నెలసరి పింఛన్లు లబ్ధిదారులందరికీ అందజేస్తామన్నారు. పింఛను పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సంబంధిత శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఒక పండుగ వాతావరణం లో నిర్వహిస్తామన్నారు. అలాగే వచ్చే జనవరి 23వ తేదీన వైయస్సార్ ఆసరా పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమాన్ని గ్రామ, వార్డు సచివాలయం స్థాయి నుండి మండల డివిజన్ స్థాయి లో అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్వహిస్తామన్నారు
ఈ కార్యక్రమాన్ని జనవరి 31వ తేదీ వరకు కొనసాగిస్తామన్నారు. వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభించి 45 నుండి 60 సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 75 వేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో వచ్చే ఏడాది జనవరి 19వ తేదీన ఆవిష్కరిస్తున్న సందర్భంగా జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో 5 మంది చొప్పున ఎస్సీలను ఎంపిక చేసి విజయవాడకు పంపించడం జరుగుతుందన్నారు ఆరోజున అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఎస్సీ కాలనీలలో సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి తదితర అంశాల పైన ప్రజలందరికీ వివరించడం జరుగుతుందన్నారు. అనంతరం మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య (నాని) మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు,కౌన్సిలర్లు తదితర ఎన్నిక కాబడిన ప్రతి స్థాయిలోని ప్రజాప్రతినిధులు అందరూ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సన్నద్ధంకావాలని ఆదేశించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలవారి పింఛన్ 3వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పిన విధంగా జనవరి ఒకటో తేదీ నుండి 3వేల రూపాయలు పింఛన్లు వృద్ధులు, వితంతువులు, చేనేత కల్లుగీత కార్మికులు ఒంటరి మహిళలు మత్స్యకారులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో కొత్తగా 5 వేల మందికి పైబడి లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు అవుతున్నాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,42,471 మందికి ఈ సంవత్సరం 891.84 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పింఛన్ కానుక అందుకుంటున్నారని, గత నాలుగు సంవత్సరాలుగా 3013.49 కోట్ల రూపాయలు పింఛన్ల కింద ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అలాగే గతంలో స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలు 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి బకాయి పడిన 25,570 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు తిరిగి చెల్లింపు లో భాగంగా వైయస్సార్ ఆసరా పథకం కింద నాలుగో విడతగా 6,394.83 కోట్ల రూపాయలను సంబంధిత డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాలకు వచ్చే జనవరి 23వ తేదీన జమ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 79 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఆ ప్రకారం జిల్లాలో 3,12 981 మంది లబ్ధిదారులకు 292.15 కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు గత నాలుగు సంవత్సరాల నుండి 1174.52 కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు చెల్లించడం జరుగుతుందన్నారు. దీంతో వారి కుటుంబాల్లో ఆర్థిక పరిపుష్టి పెరగడం వలన టంచనుగా పొదుపు చేసుకోవడం, రుణాలు పొందడం, తిరిగి చెల్లించడం జరుగుతుందని గతంలో 20 శాతం సంఘాలు సరిగా పనిచేయని పరిస్థితి ఉండేదని నేడు 0.03 శాతానికి తగ్గిందన్నారు. అలాగే వైయస్సార్ చేయూత పథకం కింద 45-60 సంవత్సరాలు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 75 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని వచ్చే ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభించడం జరుగుతుందన్నారు.  జిల్లాలో 1,10,539 మంది లబ్ధిదారులకు 207.26 కోట్ల రూపాయలను అందించడం జరుగుతుందన్నారు. గత నాలుగేళ్లుగా 769. 24 కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు రాజ్యాంగ నిర్మాత సామాజిక సమతుల్యత,అస్పృశ్యత నివారణ, కులమతాల వ్యత్యాసం తొలగింపుకు, కుల రహిత సమాజం నెలకొల్పుటకు పాటుపడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల నిలువెత్తు విగ్రహంతో స్మృతి వనం ప్రపంచానికే తలమానికంగా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో 18.81 ఎకరాలలో 404.35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగిందని, ఆ విగ్రహాన్ని వచ్చే జనవరి 19వ తేదీన ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. ఆ విగ్రహం సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా నిలుస్తుందన్నారు. ఆ రోజుకు ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను శుద్ధిచేసి, రంగులు వేయడం జరుగుతుందన్నారు. అన్ని కలలు పాఠశాలలు,కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సామాజిక న్యాయం పై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే పల్లె పల్లెన మారుమోగేలా అంబేద్కర్ జీవిత చరిత్రను చాటి చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొనేలా బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పామర్రు అవనిగడ్డ శాసనసభ్యులు అనిల్ కుమార్ కైలే అనిల్ కుమార్ సింహాద్రి రమేష్ బాబు డిఆర్డిఏ పిడి పిఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *