తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్వహణ కోసం 27 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నియామకం

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తాడిపూడి ఎత్తిపోతల పథకంలో ఆప్కాస్ ద్వారా నూతనంగా నియమించబడిన ఉద్యోగులకు రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అభినందనలు తెలిపారు. తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్వహణ కోసం APCOS ద్వారా అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 27 మందిని నియమిస్తూ జలవనరుల శాఖ  శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. జీవో నంబర్ 717 ద్వారా  27 మందిని స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులను నియమించినట్లు జలవనరుల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.  5 విభాగాల్లో 27 మందిని నియమించగా.. వాటిలో 8 మందికి ఎలక్ట్రీషియన్ గా, మరో 8 మంది మెకానిక్ గాను, ఐదుగురు వాచ్మెన్ గాను, ఐదుగురు హెల్పర్ గాను, ఒకరిని గార్డేనర్ గాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరి జీతాలు నెలకు 15,000 రూపాయల నుంచి 18,500 రూపాయలు ఉంది. ఈ సందర్భంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించడానికి విశేష కృషి చేసిన రాష్ట్ర హోంమంత్రి, కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తానేటి వనిత మేలు ఎప్పటికీ మర్చిపోలేమని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రతను కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, హోం మంత్రి తానేటి వనిత లకు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *