-ఈరోజు స్పందనలో వచ్చిన అర్జీలు..226
-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని వ్యక్తి గతంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డి ఆర్ ఓ జి. నరసింహులు , టూరిజం ఆర్డి వి. స్వామి నాయుడు, ట్రైనీ ఎస్ డి టి లు సువర్ణ, భాను ప్రకాష్ లతో కలిసి వినతి పత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ స్పందనలో ప్రజల నుంచి వస్తున్న అర్జీని అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలన్నారు. ఈ రోజు ప్రజల నుంచి 226 అర్జీలను స్వీకరించామన్నారు. ఇందులో ఆన్ లైన్ 171 ఆఫ్ లైన్ 55 ఉన్నాయన్నారు. ఆయా శాఖలు వారీగా రెవెన్యూ 92 , హోమ్ 26 , పంచాయత్ రాజ్ రూరల్. డెవలప్మెంట్ 23 అర్జీలు వచ్చాయన్నారు. రెవెన్యూ పరంగా .
స్పందన లో ప్రజల నుండి అందిన అర్జీల్లో కడియం, వేమగిరి గ్రామాల్లో ఇంటి స్థలం కేటాయింపు జరిగినా, అధికారులు స్థలాన్ని చూపడం లేదని కె. సింహాచలం, ఎం. శ్రీలక్ష్మి తదితరులు అర్జీ అందచేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, డీఆర్వో జి.నరశింహులు, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి.స్వామి నాయుడు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు యం.భానుప్రకాష్ రెడ్డి, పి. సువర్ణ, డియంహెచ్ఓ డా.కె.వేంకటేశ్వర రావు, డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి, సీపీఓ ఎల్. అప్పల కొండ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, డ్వామా పి.జగదాంబ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి,డి ఈఓ ఎస్. అబ్రహం, డి ఎల్ డిఓ పి. వీణాదేవి, సివిల్ సప్లై జిల్లామేనేజరు వి.నాగార్జున రెడ్డి, ఎస్ ఈ పి ఆర్ ఎ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకరరావు, డి ఎల్ డివో వి. శాంతమణి పలువురు జిల్లా శాఖా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News