Breaking News

పశు నష్టము కింద రూ.2.10 లక్షలు పరిహారం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా లో “మిచాంగ్” తుఫాన్ కారణంగా జరిగిన పశు నష్టము కింద రూ.2.10 లక్షలు పరిహారం అందించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో బాధిత రైతులకు చెక్కులను అందచేశారు.

ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో వచ్చిన మిచాంగ్” తుఫాన్ కారణంగా జరిగిన పశు నష్టము అంచనా వేయడం జరిగిందన్నారు. పశు సంపద పై ఆధారపడి బ్రతుకుతున్న రైతులకు మేలు చేసే దిశగా ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు “మిచాంగ్” తుఫాన్ కు జిల్లాల వారీగా తక్షణ సహాయంగా అందించిన నష్ట పరిహారము అందించాల్సి ఉందని పేర్కొనడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత వారి ఆదేశాలు మేరకు జిల్లా పశు సంవర్ధక శాఖ ద్వారా జరిగిన నష్టము ను అంచనా వేయించి, అందుకు అర్హత గల రైతులను గుర్తించి, పశు నష్టాన్ని అంచనా వేశామన్నారు. గోపాలాపురం మండలం లో (పంది విజయ్) ఒక ఆవు పెయ్యా, (ప్రగలపాటి వెంకట రావు) ఒక గేదె, దేవరపల్లి మండలం లో (దుగ్గిన రాజేశ్వర రావు) ఒక గేదె పెయ్యా, కోరుకొండ మండలం లో (దొడ్డ నాగేశ్వర రావు) రెండు గేదెలు, గోకవరం మండలం లో (గుణ రాజ బాబు) ఒక గేదె మరియు రాజమహేంద్రవరం అర్బన్ లో (తనింక సత్యనారాయణ) ఐదు గొర్రెలు చనిపోయినవని గుర్తించడం జరిగిందన్నారు. ఐదు మండలలో నష్టపోయిన ఆరుగురు రైతులకు తక్షణమే రూ.2,10,000/- లను మంజూరు చేస్తూ పశు సంవర్ధక శాఖ, తూర్పుగోదావరి జిల్లా వారికి నిధులు విడుదల చేయడం జరిగినదని, వాటిని ఈరోజు రైతులకి అందజేసినట్లు తెలిపారు.

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక అధికారి ఎస్ జీ టి సత్య గోవింద్, డి ఆర్వో జీ. నరసింహులు, టూరిజం ఆర్ డి వి. స్వామి నాయుడు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి టి కృష్ణ నాయక్, ట్రైనీ ఎస్ డి టి పి. సువర్ణ, ఎమ్. భాను ప్రకాష్, రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *