నేటి నుంచి కులగణన సర్వే ప్రారంభం

-జనవరి 19 నుంచి 28 రోజుల పాటు సర్వే
-జిల్లాలో 8960 క్లస్టర్ పరిధిలో 6,04,059 కుటుంబాల సర్వే
-కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కులగణన సర్వే విషయంలో అత్యంత బాధ్యత గా డేటా సేకరణ చేపట్టి ఎటువంటి లోపాలు లేకుండా మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక లోగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు.

శుక్రవారం ఉదయం స్థానిక 10 వ వార్డులో కులగణన నమోదు ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత క్షేత్ర స్థాయి లో కులగణన చేపడుతున్న సిబ్బంది పనితీరును పరిశీలించారు. డేటా ఎంట్రీ సమయంలో తీసుకుంటున్న చర్యలు పై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ , జిల్లాలో జనవరి 19 నుంచి 28 వరకు 10 రోజుల పాటు కులగణన సర్వే క్షేత్ర స్థాయిలో పూర్తి చెయ్యాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 512 సచివాలయాలలో 8960 క్లస్టర్ లలో 6,04,059 కుటుంబాల కులగణన చేపట్టనున్నట్లు తెలిపారు. సర్వే ప్రక్రియ లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది 8781 మంది ఇంటింటి సందర్శన చేసి కులగణన పూర్తి చెయ్యడం జరుగుతుందని అన్నారు. జనవరి 19 నుంచి 28 వరకు ఇంటింటి సర్వే పూర్తి చేసి, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు 5 రోజుల పాటు ఆయా సచివాలయాల్లో నమోదు చేసిన డేటా అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. ప్రజలు నేరుగా వెళ్లి అందుబాటులో ఉన్న డేటా వివరాలు తెలుసుకునే సౌలభ్యం కల్పించనున్నట్లు మాధవీలత పేర్కొన్నారు. డేటా ధ్రువీకరణ / డేటా ఖరారు చేసి నిర్ధారణ ప్రక్రియ ఫిబ్రవరి 15 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బయో మెట్రిక్ ఆధారిత నిర్ధారణ చేపట్టి ఎటువంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా కులగణన పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఎదురయ్యే సమస్యలు, సందేహాలను తీర్చేలా ఎంపీడీవోలు సర్వేపై పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. మండల స్థాయి, మునిసిపల్ స్థాయి అధికారులంతా వారికి కేటాయించిన గ్రామాలలో , వార్డులలో ప్రతి రోజు సందర్శించాలని, సూపర్‌వైజర్లు కూడా ప్రతి రోజు ఫీల్డ్‌లో ఉండాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *