పౌర జీవనానికి ప్రామాణికం రాజ్యాంగం

-అణగారిన వర్గాల ఆశాజ్యోతి డా. బి.ఆర్ అంబేద్కర్
-అంబేద్కర్ ఆశయాల ప్రతి రూపంగా సామాజిక న్యాయ శిల్పం 
-డా. బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కు హాజరవుతున్న జిల్లా వాసులు
-అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి
– జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు 1931లో కుల గణన జరిగిందని , నేడు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ రోజున కులగణన ప్రారంభించడం అంబేద్కర్ కు ఇస్తున్న ఘనమైన నివాళి గా జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం,సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.

శుక్రవారం సామాజిక న్యాయ శిల్పం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు గల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనే రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా నాయకులు, ప్రజలతో కలిసి ర్యాలీగా మంత్రి బయలు దేరి వెళ్ళారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనంతరం జరగని కారణం చేత అనేక మందిలో అపోహలు ఉన్నాయని వాటన్నింటినీ పటాపంచులు చేసి , పరిష్కరించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కులగణన ప్రక్రియను ప్రారంభించడం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనమైన నివాళి గా భావిస్తునట్లు పేర్కొన్నారు. భారత దేశం లో పౌర జీవనానికి ప్రామాణికం రాజ్యాంగం అయితే ఆ రాజ్యాంగానికి అనుగుణంగా జీవించేవాడు నిజమైన ధర్మ మార్గాన నడుస్తాడని నాకున్న నమ్మకం అని మంత్రి పేర్కన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ రూప శిల్పం ఆవిష్కరణను చూసి తరించేందుకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి నాయకులతో కలిసి 15 బస్సుల్లో బస్సుకు 60 మంది చొప్పున వెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

విజయవాడలో జరుపుకుంటున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది తండోప తండాలుగా తరలివస్తున్నట్లు తెలిపారు. ప్రజానీకానికి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నాయకులకు ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

దేశ సంపద సంపన్నుడికే కాదు సామాన్యుడికి కూడా అందించాలనే ఆకాంక్షతో అనగారిన వర్గాల ఆశాజ్యోతి గా వారి జీవితాల్లో వెలుగు నింపాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించా రన్నారు.

ఆ మహనీయుడును ఆదర్శంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని చూసి తప్పకుండా అమలుపరుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలుస్తారని మంత్రి వేణు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *