‘ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ (PPVFRA)పై సెన్సిటైజేషన్ కార్యసాల

-రైతు వంగడాల మరియు హక్కుల పరిరక్షణ పై వర్క్ షాప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం స్థానిక కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, రాజమండ్రి లో 19.1.2024 న ‘రైతు వంగడాల మరియు హక్కుల పరిరక్షణ’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ICAR-CTRI డైరెక్టర్ మరియు చైర్మన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ యూనిట్ డా ఎమ్. శేషు మాధవ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. CTRI-ITMU నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని డా హెచ్, రవిశంకర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు నోడల్ ఆఫీసర్ వివరించారు.

జన్యుశాస్త్రం), వ్యవసాయ కళాశాల, PJTSAU, హైద్రాబాద్ ప్రొఫెసర్ డా జే . సురేష్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. Dr. M. Bharatha Lakshmi, అసోసియేట్ డైరెక్టర్ అఫ్ రీసెర్చ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ, మారుటేరు, డా ఎమ్. భారతి లక్ష్మి, అసోసియేట్ డీన్ మరియు హెడ్, ANGRAU వ్యవసాయ కళాశాల, రాజమండ్రి డా. సి. శ్యాంరాజ్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి ఎం. మాధవ రావు, హెడ్, IIMR రీసెర్చ్ స్టేషన్, పెద్దాపురం డా. మునిరత్నం, హేడ్ డా. జి . రామా నందం, సీనియర్ శాస్త్ర వేత్త లు డా కె. రవీంద్ర కుమార్, డా . వైయస్ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం, కొవ్వూరు; డా.పి. లలిత కామేశ్వరి , వేమగిరి ICAR-DFR శాస్త్రవేత్తలు, వివిధ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు; సిటీ ఆర్ ఐ విభాగాల అధిపతులు, శాస్త్రవేత్తలు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సీఈవోలు, రాజమండ్రి వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

పంటల అభివృద్ధి విభాగము, ICAR-CTRI విభాగపతి డా. కె. సరళ మాట్లాడుతూ
మొక్కల రకాల రక్షణ మరియు రైతుల హక్కుల అథారిటీ ( PPVFRA) రైతు వంగడాల మరియు హక్కుల ప్రాముఖ్యతను తెలియచేసారు. అభివృద్ధికి మూల కారణమైన వంగడాల ప్రాముఖ్యతను డా భారతి లక్ష్మి వివరించారు. అంతేకాకుండా వరిలో నూతనమైన రైతు వంగడాలు, తదితర అంశాల ను తెలియచేసారు. డా జె .. సురేష్ తన ప్రసంగంలో PPVFRA యొక్క ఆవిష్కరణ, పాత్ర, రైతుల హక్కులు, రిజిస్ట్రేషన్ పద్ధతులు, హక్కుల ప్రచారం, ఆర్ధిక ప్రయోజనాలు, రైతులకు భరోసా అనే అంశాలపై ప్రసంగించారు.

డా. జి. రామానందం, డా. సి. శ్యాంరాజ్ నాయక్, ఎం. మాధవ రావు తమ ప్రసంగాలలో సాగు పద్ధతులు, నూతన వంగడాలు, అవగాహన సదస్సులు, ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు రైతులకు చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు.

మున్ముందు ఇలాంటి వాటిపై మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

తన అధ్యక్ష ప్రసంగంలో, . ఎం. శేషు మాధవ్ సంస్థ పరివర్తన గురించి ప్రస్తావించారు. రైతులందరూ PPVFRA ద్వారా అందుతున్న హక్కులను వినియోగించుకునేలా ప్రయత్నించాలని పేర్కొన్నారు . రైతులు మరియు శాస్త్రవేత్తల ముఖా ముఖి నిర్వహించారు. PPVFRA తో నమోదు చేయబడిన వివిధ విజయవంతమైన ఉదాహరణలను రైతు ప్రయోజనార్ధం తెలియచేసారు. జియో గ్రాఫికల్ ఇండికేషన్ (GI) అనే అంశంపై చర్చించారు. రైతులు మరియు రైతు సంఘాల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *