రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు దృశ్యమాద్యమం ద్వారా ఆకాశవాణి రాజమహేంద్రవరం ను చెన్నై లో ప్రారంభించారని రాజమహేంద్రవరం ఎఫ్ ఎం రిలే కేంద్ర ఇంఛార్జి జి. వేణు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దీనితో పాటు మరో 11ఆకాశవాణి ఎఫ్ ఎం ట్రాన్స్ మీటర్లూ, నాలుగు దూరదర్శన్ కేంద్రాలు గౌరవం ప్రధాని మంత్రి ప్రారంభించారు. ఇంకా దేశ వ్యాప్తంగా మరో 26 ఎఫ్ ఎం కేంద్రాలకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
లాలాచెరువు వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రాజమహేంద్రవరం ఎఫ్ ఎం రిలే కేంద్రంలో డెప్యూటీ డైరెక్టర్ జనరల్ సుబ్బా రావు ప్రత్యక్షం రిలే కేంద్ర ట్రాన్స్ మీటర్ ను లాంఛనంగా ప్రారంభించారు.
102.9 మెగాహెర్ట్జ్ రాజమహేంద్రవరం ఎఫ్ ఎం కేంద్రం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర అన్ని కార్యక్రమాలు స్ధానిక ప్రజలు అందుబాటులోకి వస్తాయి.
ఈ ట్రాన్స్ మీటర్ ఏర్పాటు వలన ఆకాశవాణి కార్యక్రమాలు ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ, అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ స్పష్టంగా వినపడతాయని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర డెప్యూటీ డైరెక్టర్ జనరల్ సి. సుబ్బారావు అన్నారు.
సాంకేతికంగా కూడా కార్యక్రమాల్లో నాణ్యత పెరుగుతుందని చెప్పారు. (DDG voice)
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర కార్యక్రమాల అధిపతి సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ ఇక మీదట రాజమహేంద్రవరం ఎఫ్ ఎం లోనూ, కాకినాడ ఎఫ్ ఎం లోనూ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర కార్యక్రమాలు శ్రోతలు వినవచ్చని చెప్పారు.
(Hop voice)
ఈ ఎఫ్ ఎం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర డైరెక్టర్ ఇంజనీరింగ్ వి. ఎం.రత్నప్రసాద్ , విజయవాడ దూరదర్శన్ కేంద్రం డెప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఇ. రవికుమార్ , రాజమహేంద్రవరం ఎఫ్ ఎం రిలే కేంద్ర ఇంఛార్జి జి. వేణు ఇంకా ఆకాశవాణి, దూరదర్శన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News