ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారుల భువనేశ్వర్ పర్యటన

-నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారుల భువనేశ్వర్ పర్యటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారుల బృందం వారి యొక్క రెండు రోజుల భువనేశ్వర్ పర్యటనలో బాగంగా, రెండవ రోజున బహుళ ప్రభుత్వాల, యునెస్కో, ప్రపంచ బ్యాంకు మరియు నీతి ఆయోగ్ ల గుర్తింపు పొందిన మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంట్రప్రెన్యూర్‌షిప్ (MSDE) యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయినటువంటి “సెంచురియన్ యూనివర్సిటీ” ను సందర్శించడం జరిగింది. అక్కడ అందిస్తున్న శిక్షణల వివరాలను అడిగి తెలుసుకుని,
శిక్షణ తరగతులను, ప్రయోగశాలను మరియు నెలకొని ఉన్న పరిశ్రమలను సందర్శించి, శిక్షణ పొందుతున్న విద్యార్థులతో సంభాషించడం జరిగింది.

అనంతరం, Ms. Usha Padhee, IAS, Principal Secretary, Skill Development & Technical Education Department, Govt. Of Odisha ను కలిసి, నైపుణ్యాల అభివృద్ధి మరియు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, తదుపరి అంశాలను గూర్చి వారితో సంభాషించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో, నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారి వెంట శ్రీ ఎస్. శ్రీనివాసరావు – కృష్ణా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, విజయవాడ ప్రాంతీయ నైపుణ్య అభివృద్ధి అధికారి (FAC), శ్రీ యు.సాయి కుమార్ – పార్వతీపురం మన్యం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, శ్రీ సాయి కృష్ణ చైతన్య – విశాఖపట్నం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, శ్రీమతి బి.దీప్తి, DEO – కర్నూల్ జిల్లా, శ్రీ జి.శ్రీనివాస్, DEO – కాకినాడ జిల్లా, శ్రీ రాహుల్, సీనియర్ కన్సల్టెంట్ – KPMG మరియు శ్రీ జె. రవి తేజ యాదవ్, అసోసియేట్ మేనేజర్ – APSSDC ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *