Breaking News

అంబేద్కర్ పై ప్రేమతో కాదు రాజకీయ లబ్ధి కోసమే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, ఎస్టి ఎస్సి మైనార్టీల సంక్షేమం కోసం అబ్దుతంగా పనిచేస్తున్నాం అని చెప్పే జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని,అంబేద్కర్  రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ,నిరంకసు పాలన చేస్తూ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తే అంబేద్కర్ ని గౌరవించిన్నట్టా జగన్  సమాధానం చెప్పాలని, మీరేమో అంబేద్కర్ విగ్రహం పెట్టాం ఆనందపడమని అంటున్నారు. కానీ రాష్ట్రంలో దళితుల పై రోజు రోజుకీ దాడులు పెరిగిపోయాయని, దళిత వర్గాలు బాధపడుతున్నారని ,దక్షిణ భారతదేశంలోనే దళితులపై జరిగే దాడుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని,సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలబ్ది కోసమే అంబేద్కర్ విగ్రహం పెట్టారే తప్ప దళితుల మీద ఏమాత్రం ప్రేమతో కాదని, నిజంగా ఆయనికి అంబేడ్కర్ మీద ప్రేమ ఉంటే కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు వివాదాలు, విధ్వంసాలు రెచ్చగొట్టే వారు కాదని అంబేద్కర్ కంటే జగన్మోహన్ రెడ్డి  గొప్పోడా అంబేడ్కర్  విదేశీ విద్యా పథకానికి పేరు మార్చి జగనన్న విదేశీ విద్య పథకం అని పేరు పెట్టుకున్నావంటే నువ్వు అంబేద్కర్ కన్నా గొప్పవాడవా ఈ సంధర్బంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ను చూసి మోసపోవద్దు గతంలో జరిగిన అన్యాయాలు దళితులపై జరిగిన దాడులను రాష్ట్ర ప్రజలు మర్చిపోవద్దని దళితులకి 27పథకాలు రద్దు చెయ్యడమే కాకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పదకం రద్దు చేశారు అని, సెంటు భూమి పథకం కింద దళితుల యొక్క అసైన్డ్ భూములను లాక్కున్నారని దీనితో పాటు దళితుల మీదే SC, St కేసులు పెట్టి వేధించారు అని ఈ అంశాలన్నీ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిఅని, విజయవాడ నగర నడి బోడ్డున విగ్రహం పెట్టిన నువ్వు విజయవాడ నగరంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు అగ్రవర్ణ పేదలని ఊరి చివరికి తరిమేసిన నువ్వు అంటరానితనం గురించి మాట్లాడుతున్నావా మరి వీళ్ళందర్నీ కూడా ఊరి చివరకి తరిమేయడం కూడా అంటరానితనమే అంటారని, మాటి మాటికి సామజిక న్యాయం అని చెప్పి నువ్వు ఎస్సీ ఎస్టీ లను వారి నియోజక వర్గాలు మార్చి వారి రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశావని ఎవరైనా సరే జగన్ పాలనలో గొంతు ఎత్తితే కేసులు పెట్టించావు , జైల్లో పెట్టించావని, అంటరాని తనం గురించి మాట్లాడే నువ్వు దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన mlc అనంతబాబునీ ఎందుకు నీ పక్కన కూర్చోపెట్టుకున్నావు నిరంకుశ పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కి అంబేద్కర్ పేరు ఎత్తడానికి గాని ఆయన విగ్రహాన్ని తాకడానికి గాని అర్హత లేదని రాష్ట్ర ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పసుపు నీళ్లు జల్లి మైలును తుడిచేయాలని అనుకుంటున్నారని,అక్కచెల్లెలు కు అండగా వుంటాను అని మాట్లాడిన నువ్వు రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అయితే ఎందుకు స్పందించలేదని,పేద సామాన్య పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య వద్దని ఎవరు అనలేదని ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు మీడియం కూడా నేర్పించాలని అన్నారని కానీ ఆ మాటలను జగన్మోహన్ రెడ్డి వక్రీకరించి మాట్లాడితే ఎలాగాఅని, విజయవాడ నగర నడి బొడ్డున వున్న అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా నేను సవాలు విసురుతున్నా విజయవాడ నగరంలో గానీ NTR జిల్లా లో గానీ దళితులకు ఒక్కరికి అయినా ఉన్నత నామినేటెడ్ పదవి ఇచ్చారా? మీకు దమ్ముంటే సమాధానం చెప్పాలని, ఈ రాష్ట్రంలోని దళితులను జగన్మోహన్ రెడ్డి కేవలం ఓటు బ్యాంకు గానే వాడుకున్నారని ఈ విషయం ఎస్సీ , ఎస్టీ ప్రజలు లు గమనించారని రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కి వారి నుండి చావు దెబ్బ తప్పదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సోమీ గోవింద్, సయ్యద్ ముబీనా, బంది చౌడే శ్రీను, పైలా పవన్, దాసిన జగదీష్, కొరగంజి సాంబ, పిల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *