Breaking News

అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు హర్షణీయం

-జగన్‌ను ప్రపంచ మేధావితో పోల్చడం అంబేద్కర్‌ను అవమానించినట్లే
-రాష్ట్రపతి, గవర్నర్‌లను ఆహ్వానించకపోవడం సరికాదు
-వైసిపి రంగులతో ముంచెత్తడానికి ఇది పార్టీ ఈవెంట్‌ కాదు
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చైతన్యవంతమైన విజయవాడ నగరంలో అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయటంపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల ఎత్తుతో ఏర్పాటుచేసిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఈ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సందర్శించి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ మహనీయుడు ప్రపంచ మేధావి డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ భారతదేశంలో అణగారిన వర్గాల ప్రజల తరుపున నిలిచి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు. ఆయన స్ఫూర్తి ఆదర్శనీయమన్నారు. దేశంలో పెద్ద అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రపతి, గవర్నర్‌లను ఆహ్వానించకపోవడం బాధాకరమన్నారు. దళిత మేధావులను, సంఘాలను, రాజకీయ పక్షాలను ఆహ్వానించకపోవడం శోచనీయమన్నారు. సంకుచిత రాజకీయ దృక్పథంతో జగన్‌ తన సొంత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాలతో ఆ కార్యక్రమాన్ని పార్టీ ఈవెంట్‌గా మార్చి అంబేద్కర్‌ను అవమానించారని విమర్శించారు. ప్రపంచమంతా అణగారిన వర్గాల ప్రజలు అంబేద్కర్‌ను స్మరించుకుంటూ ఉంటే, అణగారిన వర్గాలకు చెందిన, గిరిజన మహిళjైున భారత రాష్ట్రపతిని, మైనార్టీ వర్గానికి చెందిన రాష్ట్ర గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం సరైందికాదన్నారు. యాదృచ్ఛికమైనా సరే పై పదవుల్లో ఉన్నవారిని ఆహ్వానించకుండా పార్టీ ఈవెంట్‌ గా మార్చినందుకు తప్పుపడుతున్నామన్నారు. సభలో మంత్రి పదవుల కోసం మాట్లాడిన వారి ఉపన్యాసాలు చూస్తే వారి నోర్లు ఫినాయిల్‌తో కడగాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం మంత్రి పదవుల కోసం జగన్‌ను పొగడటానికి అభినవ అంబేద్కర్‌తో పోల్చడం, మహనీయుడు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ను అవమానించినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వార్థప్రయోజనాల కోసం బలైన దళిత యువకుడు సెంట్రల్‌ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడని, దళిత డ్రైవర్‌ సుబ్రమణ్యంను కొట్టి చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎంఎల్‌సి అనంత ఉదయ భాస్కర్‌ సమాజంలో దర్జాగా తిరుగుతున్నాడనీ, ఇదే జగన్మోహన్‌రెడ్డి దళితులకిచ్చే గౌరవమా? అని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ కోటేశ్వరరావు, మహిళా సమాఖ్య ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌ దుర్గా కోటేశ్వరరావు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, డిహెచ్‌పిఎస్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ బుట్టి రాయప్ప, వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు, డిహెచ్‌ పిఎస్‌ నాయకులు సంగుల పేరయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *