-ప్రజారోగ్య సంరక్షణకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ పథకాలు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నాం
-గత 4 సంవత్సరాల్లో వైద్యరంగంలో 55వేల మంది వైద్య సిబ్బందిని నియమించాం
-గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ పోషణ ప్లస్ ఆహారాన్ని అందిస్తున్నాం
-అందరికీ వైద్య సేవలు అందించే దిశగా అనేక సంస్కరణలు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు
-మంత్రి వేణుగోపాల కృష్ణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే అనారోగ్య సమాజానికి బీజం పడుతుందనే భావనతో ఆరోగ్యవంతమైన సమాజం కొరకు ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల అవగాహన శ్రద్ధను పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని
జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి మరియు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.
బుధవారం స్వచ్ఛత మన బాధ్యత.. గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి 17వ వార్డు శంభు నగర్ లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో
జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి మరియు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పాల్గొని ఆసుపత్రికి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజారోగ్య సంరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. పేదరికంలో ఉన్న ప్రజలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే అనారోగ్య సమాజానికి బీజం పడుతుందనే భావనతో ఆరోగ్యవంతమైన సమాజం కొరకు ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల అవగాహన శ్రద్ధను పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జగనన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భంలో ఉన్న శిశువు కూడా ఆరోగ్యంగా పుట్టాలన్న లక్ష్యంతో గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పౌష్టికాహార అందించడం జరుగుతుందన్నారు. గత నాలుగు సంవత్సరాల పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55వేల మంది వైద్య సిబ్బందిని నియమించారన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని రాజమండ్రి లో నూతనంగా వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఫ్యామిలీ కాన్సెప్ట్, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ ద్వారా సకాలంలో ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని మంత్రి అన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా రు.2.5 లక్షల ఖరీదైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తే, ఆయన తనయుడు గా నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు రు.25 లక్షల ఖరీదైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నాడు 14 సంవత్సరాలు పాలను చేసిన ప్రతిపక్ష నాయకులకు ప్రజారోగ్యం పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకోలేదన్నారు.
మంత్రి ఈ సందర్భముగా జగనన్న ఆరోగ్య సురక్ష ఉచిత వైద్య శిబిరానికి వైద్య సేవలు పొందేందుకు విచ్చేసిన మహిళలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధుల తో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి అమలు చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ ఎం మనాంద్ చంద్ తో మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తున్న వైద్య సేవలు తెలుసుకొని మందులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం శంభు నగర్ లో ఉన్న రైతు బజార్ పరిశీలించి వినియోగదారులకు అందుతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎస్ఈ పాండురంగారావు, హెల్త్ ఆఫీసర్ ఏ వినూత్న, పీహెచ్సీ డాక్టర్ ఎం మనాంద్ చంద్,మున్సిపల్ అధికారులు, సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News