రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈ వి ఎమ్ గోడౌన్ తనిఖీ

-24 x 7 సిసి కెమెరాల పర్యవేక్షణలో ఈవిఎమ్ గోడౌన్
-మృతి చెందిన ఓట్ల తొలగింపుకు డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి
-కలెక్టర్ కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ తనిఖీల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబందించిన బ్యాలెట్ యూనిట్స్,  కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాడ్స్ ను భద్ర పరిచిన గోడౌన్ ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చెయ్యడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఏర్పాటు చేసిన ఈ వి ఎమ్స్ భద్రపరచిన గోడౌన్ ను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ  ఇప్పటికే ఎస్ ఎస్ ఆర్ 2024 కి చెందిన ఓటరు తుది జాబితా ప్రకటించడం జరిగిందన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో  తూర్పు గోదావరీ జిల్లాకు కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు చెందిన యూనిట్స్  బ్యాలెట్ యూనిట్స్,  కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాడ్స్ లను తనిఖీ చేసి భద్ర పరచడం జరిగిందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేసి, రిజిస్టర్ లో సంతకాలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పోలీసు భద్రత తో పాటు, సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ గోడౌన్ ను మూడు షిఫ్ట్ లలో పోలీసు భద్రత కల్పించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ కేంద్రంలో భద్రపరచిన జిల్లాకు కేటాయించిన 5,971 బ్యాలెట్ యూనిట్స్, 5,463 కంట్రోల్ యూనిట్స్, వివిపాట్ యూనిట్స్ 4,927 లను సాంకేతికంగా  తనిఖీ చేసి, వాటి పని తీరును నిర్ధరణ చెయ్యడం యూనిట్స్ పనితీరు పరిశీలించి కేంద్ర ఎన్నికల కమిషన్ కు నివేదిక ఇచ్చినట్లు తెలియ చేశారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు మరణించిన ఓటర్ల తొలగింపు కొరకు జాబితా ఇచ్చామని అయినా తొలగించ లేదని కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. మృతి చెందిన ఓటర్ల కు చెందిన ఓటరు యొక్క డెత్ సర్టిఫికెట్ తో కూడి ఫారం 7 సంబంధిత బి ఎల్ ఓ ద్వారా ధరఖాస్తు చేస్తే అటువంటి వాటిని ఓటరు జాబితా నుంచి తొలగించడం జరుగు తుందనీ కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు.

కలెక్టర్ వెంట అర్బన్ తహసిల్దార్ వి. సుస్వాగతం, , రాజకీయ పార్టీల ప్రతినిధులు  కాంగ్రెస్ – నలబాటి రమేష్ (శ్యామ్) , వైయస్ఆర్ సీపీ – వై రాజశేఖర్, రాయుడు గణేష్ , టిడిపి సలాది ఆనంద్, సిహెచ్ . శ్రీనివాస రావు ,   బిజెపి – బి. రామచంద్ర రావు,   కలెక్టరేట్ ఎన్నికల డి టి సునీల్ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *