Breaking News

ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం పై పజిల్ పోటీలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా పాకాల మండలం నందు ప్రభుత్య డిగ్రీ కళాశాల లో లీడ్ బ్యాంకు మేనేజర్ ఆర్ సుభాష్ ఆధ్వర్యంలో మరియు కళాశాల అధ్యక్షులు డా . ఏ మొహిద్దీన్ భాషా అధ్యక్షతన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం పై 70 మంది విద్యార్థులకు పజిల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఫైనాన్సియల్ లిటరసీ యొక్క ఆవశ్యకత ను మరియు దైనందిక జీవితములో ఉపయోగాలు , సమస్యలు , పరిష్కార మార్గాలను అధ్యక్షులు వివరించారు . ఈ పోటీలో విద్యార్థులు చాలా ఆసక్తి కనపరిచి ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది విద్యార్థులకు ముఖ్యంగా చిన్నతనము నుండే వారి విద్యాభ్యాసంలో భాగంగా మంచి పొదుపు అలవాట్లు, డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత పైన అవగాహన కలిగి మరియు సైబర్ నేరాలపై అంతర్జాలం నందు తప్పుడు మార్గాలలో ఆర్థిక నేరాలకు మోసపోకుండా ఏ విధంగా మెలకువలు పాటించాలనే విషయం ప్రధానంగా సుభాష్ గారు చెప్పడం జరిగింది. ఈ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వాణిజ్య శాస్త్ర అధిపతి డా . వి. మాసూలమని , అధ్యాపకులు , బ్యాంక్ అధికారులు సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్సు మరియు ఇతర అధ్యాపకులు పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *