రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు-2024 కి సంబంధించి సెక్టరల్ అధికారులు పొలింగ్ కేంద్రాల కు ఎన్నికల సామాగ్రి తరలింపు పర్యవేక్షణా నుంచి రిసెప్షన్ కేంద్రాలకు చేరే వరకు విధులను అత్యంత ప్రాధాన్యత తో నిర్వహించాలని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఎన్.తేజ్ భరత్ ఆదేశించారు.
స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 51- రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఎన్.తేజ్ భరత్ సమక్షంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆర్ ఓ తేజ్ భరత్ మాట్లాడుతూ , సెక్టార్ అధికారులకు, పోలింగ్ అధికారులకు, మైక్రో అబ్సర్వర్స్, ఇతర ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. పోలింగ్ జరిగే ముందు రోజూ పోలింగ్ సామగ్రి పంపిణీ , ఎన్నికల రోజున వివిధ పోలింగ్ కేంద్రాల నుంచీ బ్యాలెట్ యూనిట్స్ పనితీరు, ఓటింగు పూర్తి అయిన తరువాత రిసెప్షన్ కేంద్రాలకు ఆయా యూనిట్స్ చేరే వరకు ప్రతి ఒక్క స్థాయి లో నిబద్దత కలిగి విధులను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల కమీషన్ జారీ చేసిన మార్గదర్శకాలు, ఎప్పటి కప్పుడు జారీ చేసే ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాల్సి ఉందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన అంశాల పై అవగాహన కల్పించడం కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించి, సందేహాలను నివృత్తి చేయటం జరిగిందనీ అన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మీకు అందచేసిన మెటీరియల్ ను అధ్యయనం చేయడం ద్వారా సందేహాలు ఉత్పన్నం అవుతాయనీ, వాటిపై మీ సందేహాలు నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమం లో సహాయ రిటర్నింగ్ అధికారి/ డిప్యూటీ కలెక్టర్ సాయిబాబు రాజమండ్రి రూరల్ తహశీల్దార్ కె. అప్పా రావు, కడియం తహశీల్దార్ వి.రమాదేవి , సెక్టార్ అధికారులకు, పోలింగ్ అధికారులకు, మైక్రో అబ్సర్వర్స్, బి ఎల్ వో లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News