నగరంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ను పరిశీలన

-పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఓటింగు నమోదు అయిన ప్రాంతాల్లో పర్యటన
-బీ ఎల్ వో లు ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి
-ఒకే ప్రాంగణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట్ల ప్రత్యేక భద్రత ఏర్పాట్లు
– జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
– ఎస్పి పి. జగదీశ్

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణ పరిథిలో గత ఎన్నికల్లో తక్కువ ఓటు నమోదు అయిన పోలింగ్ కేంద్రాలను , ఒకే ప్రాంగణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న కేంద్రాలను తనిఖీ చేసి, అక్కడి ఏర్పాట్ల ను ఎస్పీ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందనీ జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు.

మంగళవారం రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ఆర్ సీ ఎస్ ఎమ్ స్కూల్, సుబ్బారావు నగర్, లాలా చెరువు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ లలో ఏర్పాటు చేసిన సుమారు 10 కి పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పి పి. జగదీష్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించడం జరిగిందనీ, ఆ ఓటు హక్కు ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వొచ్చి వినియోగించడం పై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది బాధ్యత అన్నారు. త్వరలో ఎన్నికల కమీషన్ 2024 సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఓటింగ్ శాతం పెరిగేలా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిథిలో ప్రత్యేక స్వీప్ కార్యకలాపాలను చేపట్టాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఒక్క ఓటరు తప్పకుండా పోలింగ్ కేంద్రాలకి వచ్చెలా చైతన్యం తీసుకోవాలన్నారు. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని, ఇంటింటి సర్వే చేపట్టి గత ఎన్నికల్లో ఎందుకు ఓటు హక్కును వినియోగించుకాలేదో తెలుసుకుని వారిలో ఓటు హక్కు యొక్క విలువ తెలియ చేయాలన్నారు. ఆ యా పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక స్వీప్ కార్యకలాపాలను చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది, పోలీసు, కేంద్ర బలగాలు మధ్య సమన్వయం ముఖ్యం కానున్నట్లు తెలిపారు.

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. జగదీశ్ మాట్లాడుతూ , ఒకే స్కూల్ ప్రాంగణంలో 5 అంతకు మించి ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట్ల ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పోలీసు అధికారులు పర్యటించి కార్యచరణ రూపొందించడం జరిగిందనీ పేర్కొన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల కు అధిక స్థాయి లో ఓటర్లు వొచ్చి ఓటు హక్కును వినియోగించు కునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ తెలియ చేశారు. ఎన్నికలు అత్యంత విజయవంతం అవడంలో పోలీసు అధికారులు సిబ్బంది నిర్వహించ తలపెట్టిన భద్రత ఏర్పాట్లు కీలకం కానున్నట్లు తెలిపారు.

ఈ పర్యటన లో మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ , డీఎస్పీ సెంట్రల్ జోన్ కె. విజయ పాల్ , ఎస్ బి సి ఐ సూరి అప్పారావు , తహశీల్దార్ కే . ఆంజనేయులు , డిప్యూటీ తహసీల్దార్లు (ఎన్నికల) ఎమ్. పవన్ కుమార్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్  వీరయ్య గౌడ్ , ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ కె వి ఎస్ సత్యనారాయణ , బి ఎల్ వో లు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *