Breaking News

రూ.20 .65 కోట్ల ఇండస్ట్రియల్ పార్కు కి భూమి పూజా

-హాజరైన మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మేల్యే జక్కంపూడి రాజా, పరిశ్రమల అధికారులు

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజానగరం నియోజక వర్గం రానున్న రోజుల్లో అతి పెద్ద పారిశ్రామిక వాడ గా అభివృద్ది పరచడం జరుగుతుందనీ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు వద్ద రూ.20 కోట్ల 65 లక్షల తో చేపట్టనున్న పనులకు శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, ఈ నియోజక వర్గంలో 100 ఎకరాల స్థలంలో ప్రతిష్టాత్మక మైన 300 పైగా పరిశ్రమల ఏర్పాటు చేయడం కోసం  మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకుని వచ్చేందుకు నిధులను విడుదల చేయటం జరిగిందన్నారు. భవిష్యత్ లో ఇక్కడ పెద్ద ఎత్తున యువత కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనకు అవకాశం ఉందని అన్నారు. త్వరలో ఇండస్ట్రియల్ పార్కు కి అత్యున్నత స్థాయి లో మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకుని రావడం జరుగుతుందనీ అన్నారు. అందులో భాగంగానే ఇండస్ట్రియల్ పార్కు, ఆటో నగర్ లకు రహదారి ఏర్పాటు చేయాడం, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి జరుగుతుందనీ అన్నారు. సంక్షేమం, అభివృద్ది కోసం చిత్తశుద్ధితో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అండగా నిలవాలని కోరారు.

ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లడుతూ, రాజానగరం నియోజక వర్గ పరిథిలో ఇండస్ట్రియల్ పార్కు లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రు.20 కోట్ల 65 లక్షలు విడుదల చేయటం జరిగిందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కృషికి నియోజక వర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ఆటో నగర్ అభివృద్ధికీ హమీ ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ భూమి పూజా కార్యక్రమంలో ఎపి ఐ ఐ సి జోనల్ మేనేజర్ ఎ.రమణా రెడ్డి , జిల్లా జోనల్ మేనేజర్ (అడ్మిన్)డివి ఎన్ ఎస్ జ్యోత్స్న, డివిజనల్ జోనల్ మేనేజర్ (ఇంజనీరింగ్) .రాధా మణి, ఫైనాన్స్ మేనేజర్ కే . మురళీ కృష్ణ, ప్రజా ప్రతినిధులు జడ్పిటిసి వాసంశెట్టి పెద్ద వెంకన్న, దూలం పెద్ద, గంగిసేటి సోమేశ్వరరావు, ఎంపీటీసీ గుర్రాల జోష్న గండి నాని బాబు,గంటా శ్రీను అడబాల చిన్న బాబు, కరి నాగేశ్వరావు వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *