Breaking News

రాజకీయ పార్టీల ప్రతి నిధు లు, ఎన్నికల ప్రవర్తన నియమా వళిని తప్పక పాటించాలి

-ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన నియమావళిని, రాజకీయ పా ర్టీల ప్రతినిధులు, ప్రింట్ , ఎల క్ట్రానిక్ మీడియా, సోషల్ మీ డియా పాత్రికేయులు ఖచ్చితం గా పాటించాల్సి ఉంటుంది.
-డిప్యూటీ కలెక్టర్, రూరల్ ఎ ఆర్ ఒ అధికారి ఐ. సాయి బాబా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన నియమావళిని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రింట్,ఎల క్ట్రానిక్ మీడియా, సోషల్ మీ డియా పాత్రికేయులు ఖచ్చితం గా పాటించాల్సి ఉంటుందని రాజమండ్రి రూరల్ సహాయ రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కలెక్టర్, ఐ.సాయిబాబా పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణ పై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో ఎన్ని కలలో పొలిటికల్ పార్టీలు, మీడియా పాత్ర పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమాచార ప్రజలకి చేర్చడంలో మీడియా బాధ్యత కీలకమని,
అవగాహన కల్పించి సందేహా లు నివృత్తి చేసుకొని వచ్చే సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి మీడియా తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సజావుగా జరగడానికి తీసుకున్న ఏర్పాట్ల పై వివరించారు. ఎన్నికల నిర్వహణా పై ప్రతికూల వార్తలు ప్రచురించే సందర్భంలో సంభందిత పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి, వాస్తవా లను మాత్రమే ప్రచురించాలని కోరారు. అసత్య మైన కథనాలు వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. వాటికీ సంబందించి వివరణలను ఖచ్చితంగా ప్రజలకు, ఓటర్ల కు చెరవెయ్యల్సి ఉంటుందనీ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు సంబంధించి పాత్రికేయులు వాస్తవమైన సమాచారం తో కూడిన రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రాంతం, మతం, కులం, జాతి, వర్గం లేదా భాష ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచే వార్తలను రిపోర్టింగ్ చేయకూడదని స్పష్టం చేసారు. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ జారీ చేసే సూచనలను ప్రచురించడం ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు, పోటీలో ఉండే అభ్యర్ధులకు ఎన్నికల కమిషన్ నియమావళి పై అవగాహన కలిగించాలని అన్నారు. ముఖ్యంగా చెల్లింపు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ అభ్యర్ధి కోసం రాసారో ఆ అభ్యర్ధి వ్యయం లో చెల్లింపు వార్త విలువ జమ అవుతుందని గుర్తుంచు కోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఉల్లంఘనల పై వార్తలు రాసి అభ్యర్ధులకు, ప్రజలకు అవగాహన కలిగించ డానికి మీడియా తమ వంతు కృషి చేయాలనీ అన్నారు. ఎంపీ అభ్యర్థికి రూ..95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థికి రు.40 లక్షలు వరకు మాత్రమే ఎన్నికల నియమాల్ని అనుసరిస్తూ ఖర్చు పరిమితం చేయవలసి ఉంటుందన్నారు. పోటీలో పాల్గొన్న అభ్యర్థులు చేసే ఖర్చు స్క్రటీనీ చేయబడుతుందని, పోటీలో ఉన్న అభ్యర్థి మోడల్ కోడ్ కాండాక్ట్ వైలేషన్ కు పాల్పడితే ఎన్నిక రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఊరేగింపులో రోడ్ షోలు, సమావేశంలో అన్ని ఎలక్షన్ కమిషన్ నిభందనలు మేరకు అనుమతి తీసుకోవాలన్నారు.

కార్యక్రమంలో రాజమండ్రీ రూరల్ తహశీల్దార్లు వై వి అప్పారావు, కడియం తహశీల్దార్ వి. రమా దేవి, రాజకీయ పార్టీల తరపున వైఎస్ఆర్సిపి రాజకీయ ప్రతినిధులు సిహెచ్ నరేష్,టి విష్ణుమూర్తి, ఐఎన్ సి ప్రతినిధి బి మురళీధర్, సిపిఐ (ఎం) ప్రతినిధులు కే.రామకృష్ణ, పి. రామకృష్ణ, సిపిఐ ప్రతినిధి వి.కొండలరావు, టిడిపి ప్రతినిధి జగదీష్ బాబు, రూరల్ నియోజకవర్గం మీడియా ప్రతినిధులు, ఇతర ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *