-ఇబ్రహీంపట్నం సహాయ మాత దేవాలయంలో పండుగ వాతావరణం
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సకల విశ్వాసానికి రాజాధిరాజైన ప్రభువునకు జయ జయ నినాదాలతో, హోసన్న స్తుతి గీతాలతో, జెరూసలేము నగరమునకు ఆనాడు క్రీస్తు ప్రభువు ను ప్రజలు ఆహ్వానించిన విధానాన్ని నేడు కతోలిక శ్రీ సభ కొనియాడుతుంది. సకల మానవాళి పాప విమోచన కొరకు, ఈ పవిత్ర వారం ఎంతో ప్రాముఖ్యత చెందిందని విచారణ గురువు ఫాదర్ అనిల్ కుమార్ తెలిపారు. దావీదు తనయ హోసన్న యూదుల రాజా హోసన్నా స్తుతించుచు ఏసుప్రభు బాటలో నడిచి మీ కీర్తనలు పాడుచు మేము ఆరాధించే విశ్వాసులుగా మలచి మమ్ము నిరంతరము దీవించే విధంగా తయారు చేయమని ఈ పవిత్ర మాని కొమ్మల ఆదివారాన్ని వేడుకున్నారు. ఉదయం ఏడు గంటలకు కొమ్మలను చేత పట్టుకొని దావీదు తనయ హోసన్న అనుచు దేవాలయమునకు చేరుకొని సమిష్టి దివ్యబలు పూజలు ఫాదర్ అనిల్ కుమార్ మరియు సహాయక గురువు ఫాదర్ జోసఫ్ నిర్వహించారు. ఈ దివ్యబలి పూజలో ఏసుప్రభు ఆనాడు ఏ విధంగా జెరూసలేములో తన పవిత్ర వార ప్రయాణాన్ని ఎలా కొనసాగించారు వాటిని ప్రజలకు వివరించారు. ఈ వారం క్రైస్తవులకు ఎంతో పవిత్రమైనదని, ఈ వారంలో జరిగే పవిత్ర కార్యాలను ప్రజలకు వివరించారు. బుధవారం దేవాలయం నందు పరిశుద్ధ సిలువ మార్గము, అనంతరం దివ్యబలి పూజలు నిర్వహిస్తున్నామని, గురువారం పవిత్ర వారం కావడంతో ఆరోజు ఆరు గంటలకు జపమాల అనంతరం శిష్యుల కాళ్లు కడిగే సాంఘ్యం ఉంటుందని, మంచి శుక్రవారం అనగా గుడ్ ఫ్రైడే రోజున దేవాలయం నందు పరిశుద్ధ సిలువ మార్గం ఉంటుందని తెలిపారు.
Prajavartha Online Telugu News